Mohan Babu Repeating Same Mistake of Chiranjeevi With Android Kunjappan Movie Remake: నటుడు మోహన్ బాబుకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో విలన్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత హీరోగా మారి, నిర్మాతగా కొనసాగిన ఆయన ప్రస్తుతం సినిమాల విషయంలో కాస్త వెనుకబడ్డారు. ఆయన సరైన హిట్టు అందుకుని చాలా కాలమే అయింది. తాజాగా ఆయన ఒక మలయాళ రీమేక్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఇక్కడే ఒక లొసుగు ఉంది, అసలు విషయం ఏమిటంటే 2019వ సంవత్సరంలో మలయాళంలో ఆండ్రాయిడ్ కుంజప్పన్ పాయింట్ టు ఫైవ్ అనే సినిమా విడుదలయి సూపర్ హిట్ గా నిలిచింది. రతీష్ బాలకృష్ణన్  దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సూరజ్ వెంజరమూడు కీలక పాత్రలో నటించారు. ఇక ఆయన కాకుండా సౌబిన్ షాహిర్, సూరజ్ తేలక్కడ్ కీలకపాత్రలలో నటించారు. ఇక ఈ సినిమాను ఆండ్రాయిడ్ కట్టప్ప పేరుతో తెలుగులో డబ్బింగ్ అయ్యి ఆహా అలా కూడా రిలీజ్ చేశారు. ఇండియా నుంచి జపాన్ వెళ్లి అక్కడ ఒక రోబోటిక్ కంపెనీలో పనిచేస్తూ ఉండే కొడుకు తన తండ్రి ఆలనా పాలన చూసుకోవడం కోసం తన కంపెనీ తయారు చేసిన రోబోట్ ని భారతదేశం పంపిస్తాడు.


అయితే ముందు దానికి దూరంగానే ఉన్నా కొడుకు దూరమై నా అనే వాళ్ళు ఎవరూ లేని పరిస్థితుల్లో ఆ రోబోట్ కి దగ్గరవుతాడు సదరు వృద్ధుడు. ఆసక్తికరమైన కథనంతో సాగే ఈ సినిమా మలయాళం వారినే కాదు తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను మంచు విష్ణు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల నిర్వహించిన ఒక మీడియా సమావేశంలో మంచు విష్ణు మాట్లాడుతూ ఈ సినిమా షూట్ వచ్చేఏడాది జనవరిలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించారు.


ఈ సినిమాలో వృద్ధ పాత్రలో తన తండ్రి మోహన్ బాబు నటిస్తారని పేర్కొన్న ఆయన కొడుకు పాత్రలో ఎవరు నటిస్తారనే విషయం మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఆ పాత్ర తాను మాత్రం చేయడం లేదని చెప్పుకొచ్చారు. తాను చేయకపోవడానికి కూడా కారణం కూడా తన తండ్రి అని అన్నారు. ఆయనతోపాటు నటించడం అంటే చాలా భయంతో కూడుకున్న పని అని చెప్పుకొచ్చారు. అయితే అసలు రిస్క్ ఏమిటంటే మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా కూడా దాదాపు ఇదే రీతిలో రిలీజ్ అయింది. ఎలా అయితే లూసిఫెర్ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేశారో ఏఈ ఆండ్రాయిడ్ కట్టప్ప పేరుతో కూడా తెలుగులో రిలీజ్ చేశారు.


మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా అంటే ఒకరకంగా కొంత మార్పులు చేర్పులు చేసుకుని బయటకు వచ్చింది. దీంతో తెలుగు ఆడియన్స్ ను కొంత ఆకట్టుకోగలిగింది. అయితే లూసిఫర్ ఒరిజినల్ కలెక్షన్లను దాటగలదా లేదా అనే విషయం మీద మీమాంస నెలకొంది. ఇప్పుడు మోహన్ బాబు కనుక ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తే ఆ సినిమా కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీంతో మెగాస్టార్ చిరంజీవి చేసిన తప్పే ఇప్పుడు మోహన్ బాబు కూడా చేస్తున్నారా? అనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో అయితే జోరుగా జరుగుతోంది. చూడాలి మరి ఏం జరగబోతోంది అనేది.


Also Read: Zee Telugu Kutumbam Awards: సుధీర్-ప్రదీప్-శ్రీముఖిల సందడితో జీ తెలుగు కుటుంబం అవార్డ్స్... ఆరోజునే!


Also Read: Tollywood Hero Arrested: జూనియర్ ఆర్టిస్ట్ పై రేప్.. తెలుగు హీరో అరెస్ట్?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook