MohanBabu: మెగా ఫ్యామిలీ `మా` ఎన్నికల్లో పోటీ చేస్తే.. విష్ణును విత్‌డ్రా అవ్వమని చెప్పేవాడిని..
MAA Elections 2021: టాలీవుడ్లో ఇప్పుడు పెద్ద దిక్కు ఎవరూ లేరని సీనియర్ నటుడు మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా మా ఎన్నికలు, మెగా ఫ్యామిలిపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కలెక్షన్ కింగ్.
MAA Elections 2021: 'మా'’ఎన్నికలపై కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(MohanBabu) కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన పలు విషయాలపై స్పందించారు. చిరంజీవి కుటుంబం నుంచి ఎవరైనా ‘మా’ ఎన్నికల్లో నిలబడి ఉండుంటే తాను మంచు విష్ణుని ఎన్నికల నుంచి విత్‌డ్రా అవ్వమని చెప్పేవాడినని సీనియర్ నటుడు మోహన్‌బాబు తెలిపారు. తాజా ఎన్నికల్లో(MAA Elections 2021) విష్ణు విజయం తథ్యమని.. ప్రెసిడెంట్‌గా ప్రమాణస్వీకారం చేసి ఇచ్చిన మాట ప్రకారం ‘మా’ భవనం కట్టించి తీరతాడని ధీమా వ్యక్తం చేశారు.
చిరంజీవి ఎప్పటికీ స్నేహితుడే...
ప్రకాశ్‌రాజ్(Prakash Raj)తో తనకేమీ గొడవలు లేవని.. తాను ఎక్కడైనా కనిపిస్తే.. అన్నయ్యా బాగున్నారా అని బాగానే మాట్లాతాడని మోహన్‌బాబు‘(MohanBabu) తెలిపారు. అలాగే ‘మా’ ఎన్నికల్లో జయసుధ మద్దతు తమకే ఉంటుందని భావించామని.. అందరూ అదే అనుకున్నారని.. కానీ ఆమె అవతలి ప్యానల్‌కు మద్దతు ఇచ్చారని.. అది ఆమె వ్యక్తిగత విషయమని ఆయన వివరించారు. చిరంజీవి(Chiranjeevi) ఎప్పటికీ నా స్నేహితుడే అన్న మోహన్ బాబు..తమ మధ్య ఎలాంటి దూరం పెరగలేదన్నారు. ఈ ఎన్నికల్లో మద్దతు కోరుతూ దాదాపు 800 మంది ఆర్టిస్టులతో ఫోన్‌లో మాట్లాడా. మంచు విష్ణు(Manchu Vishnu) కూడా సుమారు 600 మందితో మాట్లాడాడు. కొంతమందిని కలిశాడు.
Also read: MAA Elections 2021: హోరాహోరీగా 'మా' ఎన్నికల ప్రచారం...మంచువిష్ణుకు బాలకృష్ణ మద్దతు
సినీ పరిశ్రమలో పెద్దలెవరూ లేరు..
ప్రస్తుతం సినీ పరిశ్రమలో పెద్దలెవరూ లేరు. గురువుగారు దాసరి నారాయణరావు(Dasari Narayana Rao)తోనే ఆ పెద్దరికం పోయింది. ఇప్పుడు ఎవరైనా తాము సినీ పెద్దలుగా భావిస్తున్నారేమో నాకు తెలీదు. దాని గురించి నేను మాట్లాడను. గతంతో పోలిస్తే సినిమాలు చేయడం తగ్గించాను. నాకు నప్పే పాత్రలు వస్తే తప్పకుండా నటిస్తాను. లక్ష్మీ ప్రసన్న బ్యానర్‌పై సినిమాలు నిర్మించడానికి ప్రయత్నిస్తాను. ఇటీవల ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ని రజనీకాంత్‌తో వెళ్లి కలిశాను. ఆయన నన్ను చూడగానే.. ‘ఇతను మంచి వ్యక్తి. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు’ అని చెప్పేశారు. ఆ తర్వాత ఆయన చెప్పిన మాటలు విని నా కన్నీళ్లు ఆగలేదు’’ అని మోహన్‌బాబు చెప్పుకొచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి