Kajal Aggarwal son Photos: హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కాజల్ తన కొడుక్కి నీల్ కిచ్లూ అని పేరు పెట్టుకుంది. ఇవాళ మదర్స్ డే కావడంతో తొలిసారి తన కొడుకు ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే ఎక్కడా ఫేస్ రివీల్ అవకుండా జాగ్రత్తపడింది. తల్లి అయ్యాక తను పొందుతున్న సంతోషాన్ని, అనుభూతిని ఇన్‌స్టా పోస్టులో చెప్పుకొచ్చింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'నువ్వు నాకెంత ముఖ్యమైనవాడివో నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నా. నిన్ను నా చేతుల్లోకి తీసుకున్న క్షణం.. నీ చిట్టి చేతులను తాకిన క్షణం... నీ వెచ్చని స్పర్శ తాకినప్పుడు, నీ అందమైన కళ్లల్లోకి చూసినప్పుడు... నీతో ఎప్పటికీ ప్రేమలో ఉంటానని తెలుసు. నువ్వు నా మొదటి బిడ్డవు. నా సర్వస్వం. రాబోయే రోజుల్లో నాకు సాధ్యమైనంతగా నీకు అన్నీ నేర్పిస్తాను. కానీ ఇప్పటికే నువ్వు నాకు చాలా నేర్పేశావు. తల్లి అంటే ఏంటో... నిస్వార్థంగా ఎలా ఉండాలో నేర్పించావు. నా శరీరం బయట కూడా నా హృదయం మనగలడం సాధ్యమేనని నేర్పించావు..' అంటూ కాజల్ తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొంది.


'నువ్వు నా సూర్యుడివి... చంద్రుడివి... నా స్టార్స్ అన్నీ నీవే చొన్నోడా... ఈ విషయం ఎప్పటికీ మర్చిపోకు...' అంటూ తన పోస్టును ముగించింది. తన చెల్లెలు, తండ్రి తన కొడుకుతో దిగిన ఫోటోలను కూడా ఇన్‌స్టాలో షేర్ చేసింది. కాజల్ ఫోటోలపై స్పందిస్తున్న నెటిజన్లు... ఆమెకు 'హ్యాపీ మదర్స్ డే' అంటూ విషెస్ చెబుతున్నారు. కాజల్ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 



Also Read: Rahul Ramakrishna: కాబోయే భార్యకు ముద్దు... త్వరలో పెళ్లి... అర్జున్ రెడ్డి నటుడి ఫోటో వైరల్...


Also Read: ఏడుగురు సజీవ దహనమైన ఘటనలో షాకింగ్ విషయాలు... వెలుగులోకి 'ప్రేమ' కోణం


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook