Happy Mothers Day 2022: ఇవాళ అంతర్జాతీయ మాతృమూర్తుల దినోత్సవం. జన్మనిచ్చిన తల్లి పట్ల ప్రేమను చాటుతూ కృతజ్ఞతను తెలిపే రోజు. ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితాల్లో చాలామందికి తమ తల్లులను పట్టించుకునే తీరిక కూడా ఉండట్లేదు. అందుకే కనీసం మదర్స్ డే నాడైనా తల్లితో గడిపేందుకు మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటారు. నిజానికి విదేశాల్లో మొదలైన ఈ మదర్స్ డే... ఇప్పుడు మన దేశంలోనూ బాగానే ప్రాచుర్యంలోకి వచ్చింది. తల్లి కోసం కేవలం ఒక్కరోజు కేటాయించడమేంటన్న విమర్శలూ దీనిపై ఉన్నాయి. తల్లి కోసం ఒక్క రోజు అని కాదు కానీ... ఆ ప్రేమమయి, నిస్వార్థ త్యాగమయి జీవితాన్ని సెలబ్రేట్ చేసేందుకు ప్రత్యేకంగా ఒకరోజు కేటాయించడంలో తప్పేముందన్న వాదన కూడా ఉంది. ఇవాళ 'మదర్స్ డే' సందర్భంగా ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్... ప్రత్యేక 'గూగుల్ డూడుల్' ద్వారా మాతృమూర్తులకు మదర్స్ డే శుభాకాంక్షలు చెప్పింది.
గూగుల్ డూడుల్ మదర్స్ డే :
గూగుల్ డూడుల్‌లో మదర్స్ డేని ప్రతిబింబించేలా మొత్తం నాలుగు ఫోటోలను షేర్ చేశారు. ఇందులో మొదటి స్లైడ్‌లో తల్లి చేయితో ఒక చిట్టి పాపాయి చేయి జత కలిసిన ఫోటో ఉంది. రెండో స్లైడ్‌లోని ఫోటోలో తల్లి ఆ చిన్నారికి బ్రెయిలీ నేర్పుతున్నట్లు ఉంది. మూడో స్లైడ్‌లో తల్లి చిన్నారికి శుభ్రతను నేర్పుతున్నట్లు చేతులు కడుక్కునే ఫోటో ఉంది. ఇక నాలుగో స్లైడ్‌లో ఇద్దరు కలిసి మొక్కలు నాటుతున్న ఫోటో ఉంది. అంటే.. చిన్నారి ఎదుగుదలలో తల్లి ఒక గురువులా, స్నేహితురాలిలా... ఇలా అనేక పాత్రలు పోషిస్తుందని ఈ స్లైడ్స్‌తో చెప్పకనే చెప్పారు.
మదర్స్ డే హిస్టరీ :
మదర్స్ డే తొలిసారిగా 20వ శతాబ్దంలో అమెరికాలో మొదలైంది. అన్నా జార్విస్ అనే మహిళ తన తల్లి మరణించిన మూడేళ్లకు గ్రాఫ్టన్‌లోని మెథడిస్ట్ చర్చిలో ఆమె జ్ఞాపకార్థం ఒక వేడుక నిర్వహించారని... అదే తొలి మదర్స్ డే వేడుక అని చెబుతారు. తన తల్లి జీవితాన్ని... ఆమె కృషిని, ప్రేమను గుర్తుచేసుకునేందుకు ఆమె ఈ వేడుక నిర్వహించారని అంటారు. ఆ తర్వాతి కాలంలో మే 9, 1914న అప్పటి అమెరికా ప్రెసిడెంట్ వూడ్రో విల్సన్ మే రెండో ఆదివారాన్ని మదర్స్ డేగా గుర్తిస్తూ ఒక డాక్యుమెంట్‌పై సంతకం చేశారు. ఆరోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించారు.అప్పటినుంచి అమెరికాలో రెగ్యులర్‌గా మదర్స్ డే నిర్వహించుకుంటున్నారు. తర్వాతి కాలంలో ఇతర దేశాలు కూడా దీన్ని ఫాలో అవుతూ వస్తున్నాయి.
Also Read: Mothers Day 2022 : రేపు మదర్స్ డే.. అసలు ఇది ఎలా మొదలైంది.. దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసా..?
Also Read: TSRTC Mothers Day Gift: మాతృమూర్తులకు 'మదర్స్ డే' స్పెషల్ గిఫ్ట్... ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook