Mouni Roy Wedding: బాలీవుడ్ హీరోయిన్ మౌనీ రాయ్ పెళ్లిపీటలెక్కబోతోంది. తన స్నేహితుడైన వ్యాపారవేత్త సూరజ్ నంబియార్ ను వివాహమాడనుంది. గోవా వేదికగా ఈ పెళ్లి వేడుకకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే బుధవారం పెళ్లికి ముందస్తు వేడుకలైన మెహందీ, హల్ది ఫంక్షన్లు జరిగాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ కార్యక్రమానికి ఎంతోమంది బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. ఆయా వేడుకల్లో పాల్గొన్న సెలబ్రిటీలు అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇప్పుడా ఫొటోలు వైరల్ గా మారాయి. 



దుబాయిలో జరగాల్సింది.. కానీ!


మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ పెళ్లి వేడుకను తొలుత దుబాయిలో నిర్వహించాలని అనుకున్నారు. కానీ, కరోనా వ్యాప్తి నేపథ్యంలో పెళ్లి వేడుకను గోవాకు మార్చినట్లు తెలుస్తోంది. అయితే పెళ్లికి వచ్చే అతిథులకు కూడా కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కొన్ని మార్గదర్శకాలను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. కొవిడ్ RT-PCR టెస్టు చేయించుకొని.. అందులో నెగెటివ్ వచ్చిన వారినే పెళ్లి వేడుకకు అనుమతిస్తారని సమాచారం. పెళ్లి ముగిసిన వెంటనే.. ముంబయిలో రిసెప్షన్ పార్టీ ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది.  



Also Read: Pia Bajpiee Photos: రంగం సినిమా హీరోయిన్ ఇప్పుడెలాగ ఉందో చూశారా?


Also Read: Radhe Shyam Release: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook