Movie Artist Association: సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ట్రోల్స్‌, మీమ్స్‌ను మూవి ఆర్టిస్ట్స్‌ సంఘం (మా) తట్టుకోలేకపోతున్నది. నటీనటులపై ట్రోల్స్‌ తీవ్రమవుతున్నాయని భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సామాజిక మాధ్యమాల్లో నటీనటులపై వస్తున్న ట్రోల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ ఫిర్యాదు వెనుక ఇటీవల చిన్నారులపై కొందరు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కొందరు హీరోహీరోయిన్లపై ట్రోల్స్ తీవ్రమవడంతో మా కఠిన చర్యలకు ఉపక్రమించింది..

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Urvashi Rautela: హాట్ హీరోయిన్‌ వీడియో లీక్‌.. బాత్రూమ్‌లో బట్టలు విప్పుతూ..


 


సోషల్ మీడియాలో సినిమా ఆర్టిస్టులపై జరుగుతున్న ట్రోలింగ్‌ను కట్టడి చేయాలని కోరుతూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) పోలీసులను ఆశ్రయించింది. సామాజిక మాధ్యమాల్లో నటీనటులపై జరుగుతున్న ట్రోల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ డీజీపీ జితేందర్‌ని కలిశారు. హైదరాబాద్‌లో డీజీపీని కలిసి మా ప్రతినిధులు ట్రోల్స్‌ విషయమై ఫిర్యాదును అందజేశారు. మా ప్రతినిధుల సమస్యలు తెలుసుకున్న డీజీపీ వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సైబర్ సెక్యూరిటీ వింగ్‌లోని స్పెషల్ సెల్ ట్రోల్స్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తుందని డీజీపీ హామీ ఇచ్చారు. పోలీస్‌ శాఖ, సినీ పరిశ్రమ సమన్వయం చేసుకుని ట్రోల్స్‌పై చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపినట్లు మా ప్రతినిధులు చెప్పారు.

Also Read: Security Denied Dhoti Farmer: లుంగీ కట్టారని అనుమతించని సెక్యూరిటీ.. మాల్‌ ఎదుట రైతుల ధర్నా


డీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం మా సంఘం ప్రతినిధి, నటుడు రాజీవ్ కనకాల మీడియాతో మాట్లాడారు. ‘ట్రోల్స్ అనేవి నవ్వుకునేలా ఉండాలి. కించపరిచేలా, భాధపెట్టేలా ఉండకూడదు. కుటుంబసభ్యుల మీద కూడా ట్రోల్ చేయడం దారుణం. నటీనటుల మీద ట్రోల్స్‌ చేస్తే సహించేది లేదు’ అని హెచ్చరించారు. మరో ప్రతినిధి, నటుడు శివ బాలాజీ స్పందిస్తూ.. ‘ట్రోల్స్‌ చేస్తున్న సుమారు 200 యూట్యూబ్ చానల్స్ జాబితాను మేం డీజీపీకి సమర్పించాం. దారుణమైన ట్రోల్స్‌కి పాల్పడే వారిని తీవ్రవాదులుగా పరిగణిస్తాం' అని తెలిపారు.


 


‘లేడీ ఆర్టిస్టులు ట్రోలింగ్‌తో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మహిళా ఆర్టిస్టుల వ్యక్తిగత గౌరవం దిగజార్చేలా చేస్తున్నారు. కొంతమంది యూట్యూబ్ చానెల్ డబ్బు సంపాదన కోసం ఇలా చేస్తున్నారు. పొలిటికల్ అండ్ సినిమా, జర్నలిస్టుల  మీద ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నారు’ అని మా సంఘం ప్రతినిధి శివకృష్ణ వివరించారు. ట్రోల్స్‌ చేయండి కానీ వ్యక్తిగతంగా ట్రోల్‌ చేయొద్దని హితవు పలికారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter