Today OTT Releases: శుక్రవారం వచ్చిందంటే చాలు..సినీ అభిమానులకు పండగ. ఎందుకంటే చాలా సినిమాలు, వెబ్ సిరీస్​లు రిలీజ్ అయ్యేది అదే రోజు. ఎప్పటిలానే ఈ రోజు కూడా పలు సినిమాలు, వెబ్ సిరీస్​లు ఓటీటీలో సందడి చేయనున్నాయి. అవేంటో చూసేద్దాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మనీహైస్ట్: ఐదో సీజన్​ వాల్యూమ్ 2-నెట్​ఫ్లిక్స్​
ప్రపంచవ్యాప్తంగా మనీహైస్ట్(Money heist)వెబ్ సిరీస్​కు ఉన్న క్రేజే వేరు. 2017లో రిలీజ్ అయిన ఈ సిరీస్ అద్యంతం ప్రేక్షకులను థ్రిల్ చేస్తోంది. ఈ స్పానిష్ వెబ్ సిరీస్​కు ఇదే చివరి సీజన్. మరీ చివరగా ప్రోఫెసర్ ఏం చేయబోతున్నాడో తెలుసుకోవాలంటే ఈ సిరీస్ చూసేయండి. ఇది శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు నెట్​ఫ్లిక్స్​లో స్ట్రీమింగ్ కానుంది.


సూర్యవంశీ-నెట్​ఫ్లిక్స్
హీరో అక్షయ్ కుమార్(Akshay Kumar)తాజాగా నటించిన చిత్రం 'సూర్యవంశీ'(Suryavanshi). ఈ మూవీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. శుక్రవారం నెట్​ఫ్లిక్స్​లో రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో అజయ్ దేవ్​గణ్, రణ్​వీర్ సింగ్ కూడా సందడి చేయనున్నారు. 


Also Read: Evaru Meelo Koteeswarulu: మహేష్ కోసం రూల్స్ బ్రేక్.. రూ.కోటి ప్రశ్న ముందుగా అడిగేసిన NTR?


ఇన్​సైడ్ ఎడ్జ్ 3-అమెజాన్ ప్రైమ్
క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన వెబ్ సిరీస్ ఇన్​సైడ్ ఎడ్జ్ 3(Inside Edge Sesaon 3). ఇందులో ఆటగాళ్ల ఫిక్సింగ్, బెట్టింగ్, వివాదాలు తదితర ఆంశాల ఆధారంగా దీనిని రూపొందించారు. ఇప్పటికే రిలీజైన రెండు సీజన్ లు ఆకట్టుకున్నాయి. శుక్రవారం నుంచి మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్(Amazon Prime)లో స్ట్రీమింగ్ కానుంది.


మంచిరోజులు వచ్చాయి-ఆహా
యువ నటుడు సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా నటించిన చిత్రం 'మంచిరోజులు వచ్చాయి'. ఈ సినిమా గత నెలలోనే థియేటర్లలోకి రిలీజై...ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు 'ఆహా' (Aha)ఓటీటీ వేదికగా ఈ రోజు ఫ్యాన్స్ ముందుకు రానుంది. మారుతి దర్శకుడు.


Also Read: Akhanda Release Review: 'మాస్ కా బాప్'- 'అఖండ' విజయాన్ని అందుకున్న బాలయ్య.. సెలెబ్రిటీస్ విషెస్!


చిత్తిరాయ్ సెవ్వనమ్-జీ5
హీరోయిన్ సాయిపల్లవి చెల్లెలు పూజా కన్నన్(Pooja Kannan) కథానాయికగా పరిచయమవుతున్న తమిళ చిత్రం 'చిత్తిరాయ్ సెవ్వనమ్'. ఈ చిత్రాన్ని జీ5(Zee5) ఓటీటీ వేదికగా రిలీజే చేశారు. 


బాబ్ బిశ్వాస్-జీ5
బాలీవుడ్ స్టార్ హీరో అభిషేక్​ బచ్చన్(Abhishek Bachchan) సీరియల్ కిల్లర్​గా నటించిన చిత్రం 'బాబ్ బిశ్వాస్'. ఇది నేరుగా జీ5లో విడుదలైంది. ఈ హిందీ సినిమాకు దియా అన్నపూర్ణ ఘోష్ దర్శకత్వం వహించారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook