Mrunal Thakur First look: నేచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం 'హాయ్ నాన్న' (Hi Nanna Movie). ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా ఈ సినిమా నుంచి మృణాల్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ ఈ పోస్టర్ ను విడుదల చేసింది మూవీటీమ్.  గిటారు బ్యాక్‌ వేసుకుని ఉన్న మృణాళ్‌ లుక్ ఆకట్టుకుంటోంది.  సినిమాలో మృణాళ్‌ గిటార్‌ నేర్పించే టీచర్‌గా కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో తెరకెక్కుతున్న 'హాయ్ నాన్న' సినిమాను వైరా ఎంటర్‌టైనమెంట్స్‌ బ్యానర్‌పై సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నాడు. అబ్దుల్‌ హేషమ్ వాహబ్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రంలో నాని కూతురిగా కియారా ఖన్నా అనే చిన్నారి నటించింది.  మరోవైపు ఈ సినిమాలో శ్రుతిహాసన్ ఓ కీలకపాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ యాక్టర్ అంగద్ బేడీ విలన్ గా ఎంట్రీ ఇస్తున్నాడు.



Also Read: Jawan Movie: షారుఖ్ 'జవాన్'లో హీరోయిన్ నయనతార కంటే గెస్ట్ రోల్ చేసిన దీపికాకే రెమ్యూనరేషన్ ఎక్కువ?


 మృణాల్‌ సీరియల్‌ నటిగా కెరీర్‌ ఆరంభించి.. 'విట్టి దండు’'అనే మరాఠి చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2019లో వచ్చిన ‘సూపర్‌30’ మూవీ హిందీలో మృణాల్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత ఈ అమ్మడు వెనుదిరిగి చూసుకోలేదు. ఆమె నటించిన బాట్లా హౌజ్‌, ఘోస్ట్‌ స్టోరిస్ వంటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. సీతారామం సినిమా ఈ బ్యూటీకి ఎనలేని క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో 'హాయ్ నాన్న'తోపాటు మరో మూడు సినిమాలు ఉన్నాయి.


Also Read: Vishwak Sen: ఇంట్రెస్టింగ్ గా విశ్వక్‌సేన్‌ కొత్త చిత్రం టైటిల్.. గూప్ బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook