Vishwak Sen: ఇంట్రెస్టింగ్ గా విశ్వక్‌సేన్‌ కొత్త చిత్రం టైటిల్.. గూప్ బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్..

Vishwak Sen new Movie: గోదావరి యాసలో అదరగొట్టేందుకు మాస్ కా దాస్ అయిన విశ్వక్ సేన్ రెడీ అవుతున్నాడు. అతడు నటిస్తున్న లేటెస్ట్ సినిమా టైటిల్‌తో పాటు ఫ‌స్ట్ గ్లింప్స్‌ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 1, 2023, 09:07 AM IST
Vishwak Sen: ఇంట్రెస్టింగ్ గా విశ్వక్‌సేన్‌ కొత్త చిత్రం టైటిల్.. గూప్ బంప్స్ తెప్పిస్తున్న గ్లింప్స్..

Vishwak Sen Gangs of Godavari: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్‌సేన్‌(Vishwak Sen) లేటెస్ట్ మూవీకి టైటిల్ ను ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’'(Gangs of Godavari) అనే టైటిల్‌ను ఖరారు చేసింది చిత్రయూనిట్. కృష్ణచైతన్య దర్శకుడు.  సోమవారం ఈ మూవీ టైటిల్ తోపాటు గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు మేకర్స్. ''మేము గోదారోళ్లం. మాట ఒకటే సాగదీస్తాం. తేడాలొస్తే నవ్వుతూ నరాలు లాగేస్తాం'' అంటూ టైటిల్‌ గ్లింప్స్‌లో గోదావ‌రి యాస‌లో విశ్వక్‌సేన్‌ చెప్పిన డైలాగ్‌ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఈ మూవీ కోసం విశ్వక్ తొలిసారి గోదావ‌రి స్లాంగ్ నేర్చుకున్నాడట. రాజమండ్రి బ్యాక్‌డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఈ మూవీలో నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. మరో కీలకపాత్రలో అంజలి కనిపించనుంది. ఈ చిత్రంలో సాయికుమార్‌, నాజ‌ర్, గోప‌రాజు ర‌మ‌ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు. యువన్‌శంకర్‌రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి మూవీని శ్రీక‌ర స్టూడియోస్‌, ఫార్య్చూన్ ఫోర్ సినిమాస్‌తో క‌లిసి సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. రౌడీ ఫెలో, ఛ‌ల్ మోహ‌న‌రంగ సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వహించిన కృష్ణ చైత‌న్య.. ఐదేళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. మెుదట ఈ మూవీని హీరో శ‌ర్వానంద్‌తో చేయాల‌ని కృష్ణ చైత‌న్య భావించారట. డేట్స్ స‌ర్ధుబాటు కాకపోవడంతో.. శర్వా స్థానంలో విశ్వక్ సేన్ తో  సినిమాను మెుదలుపెట్టారు చైతన్య. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News