Mrunal Thakur reveals she was ‘madly in love’ with Virat Kohli: భారతదేశంలో క్రికెటర్లకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకూ వారిని అభిమానిస్తుంటారు. కొందరు హీరోయిన్లు అయితే ఏకంగా క్రికెటర్లతోనే ప్రేమలో పడ్డ వాళ్లు ఉన్నారు. ఈ తరహాలోనే ఓ క్రికెటర్‌ని ప్రేమించినట్లు చెప్పకొచ్చింది బాలీవుడ్‌ నటి  మృణాళ్‌ ఠాకూర్‌(Mrunal Thakur). ప్రస్తుతం ఈ అమ్మడు క్రికెట్‌ నేపథ్యంలో హీందీలో రీమేక్‌ అవుతున్న జెర్సీ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో షాహిద్‌ కపూర్‌(Sahid Kapoor) ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన  ఇంటర్వ్యూలో మృణాళ్‌.. తాను ఒక‌ప్పుడు విరాట్ కోహ్లీని పిచ్చిగా ప్రేమించినట్లు(Madly love) చెప్పింది. తన సోదరుడికి క్రికెట్‌ అంటే చాలా ఇష్టమని అలా తాను కూడా క్రికెట్‌ చూడటం, తర్వాత ఇష్టపడడం మొదలుపెట్టి..  ఆ క్రమంలో కోహ్లీ(Kohli) ఆట చూసి ప్రేమలో పడిపోయినట్లు తెలిపింది ఈ ముద్దు గుమ్మ. దాదాపు ఐదేళ్ల క్రితం విరాట్‌తో కలిసి స్టేడియంలో ఒక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసిన జ్ఞాపకాలు ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పింది.


Also Read: Nani's Tuck Jagadish movie Review: 'టక్ జగదీశ్' రివ్యూ & రేటింగ్


తాను ఆ రోజు నీలిరంగు జెర్సీ ధరించి టీమిండియా తరపు చీర్స్‌ చేసినట్లు అప్పటి విషయాలను గుర్తు చేసుకుంది మృణాళ్‌. కట్ చేస్తే.. ప్రస్తుతం జెర్సీ(Jersy) లాంటి క్రికెట్ నేపథ్యంతో సాగే సినిమాలో భాగం కావడం తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న జెర్సీ దీపావ‌ళి(Deepavali) కానుక‌గా విడుద‌ల కానుంది. ఇది నాచురల్‌ స్టార్‌ నాని(hero nani) జెర్సీ మూవీ రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook