MS Dhoni into film industry: సినీ ఇండస్ట్రీలోకి ధోని ఎంట్రీ.. ఆ సినిమాలతో బడా ప్లాన్!
MS Dhoni entering South Indian film industry with these Movies: క్రికెటర్ ధోనీ సౌత్ ఫిలిం ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టినట్టుగా టాక్ వినిపిస్తోంది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే
MS Dhoni entering South Indian film industry with these Movies: క్రికెట్ లవర్స్ అందరికీ ధోని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్న ఆయన క్రికెటర్ గా అలాగే ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ గా అనేక విజయాలు నమోదు చేశారు. ప్రస్తుతానికి ధోని క్రికెట్ కి సంబంధించిన అన్ని ఇంటర్నేషనల్ ఫార్మట్ల నుంచి తప్పుకున్నారు. కానీ ఐపీఎల్ మాత్రం ఆడుతున్నారు, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
దాదాపుగా క్రికెట్ నుంచి తప్పుకోవడంతో ఆయన మిగతా వ్యాపారాల మీద దృష్టి పెట్టారు. ఇటీవల ఆయన ఓరియో బ్రాండ్ అంబాసిడర్ గా నియమితులు అవ్వడమే కాక ఆసక్తికరంగా ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించి వార్తల్లోకి వచ్చారు. ఇప్పుడు ధోని గురించి తాజాగా ఒక ప్రచారం జరుగుతోంది. అదేమంటే ధోని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. నిజానికి ఇప్పటికే ధోని ఆయన భార్య సాక్షి కలిసి ధోని ఎంటర్టైన్మెంట్స్ అనే ఒక నిర్మాణ సంస్థ ఏర్పాటు చేశారు.
దాని నుంచి చిన్నపాటి డాక్యుమెంటరీ లను నిర్మించారు. ‘’రోర్ ఆఫ్ ది లయన్ , బ్లేజ్ టు గ్లోరీ మరియు ది హిడెన్ హిందూ వంటి చిన్న-స్థాయి డాక్యుమెంటరీలను నిర్మించింది. అయితే ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రచారం ఏమిటంటే ఈ ప్రొడక్షన్ హౌస్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టిందని, ఆయా భాషల్లో సినిమాలు చేసి విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసిందని అంటున్నారు. ఆయన తమిళ, మలయాళ, తెలుగు సినిమాలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. నిజానికి0ఝార్ఖండ్ వాసి అయినా ధోనీ చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడడంతో ఆడడంతో ఈ మూడు రాష్ట్రాల్లోనూ ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది.
అదీ కాక ఒక క్రికెటర్ గా, మంచి కెప్టెన్గా ఆయనకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ భాషల్లో సినిమాలు చేస్తే కచ్చితంగా ఆదరణ లభిస్తుందని ధోని భావిస్తున్నాడట. నిజానికి ఆయన సౌత్ ఫిలిం ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టారని, నయనతారతో కలిసి ఒక ప్రాజెక్టు కూడా చేయబోతున్నారని కొన్నాళ్ల క్రితం ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారం మాత్రం నిజం కాలేదు. మరి ఇప్పుడు మూడు భాషలలో సినిమాలు చేస్తారన్న ప్రచారమైనా నిజమవుతుందో? లేక ఇది కూడా ప్రచారానికే పరిమితం అవుతుందో? అనేది కాలమే నిర్ణయించాలి మరి.
Also Read: Godfather Weekend Collections: గాడ్ ఫాదర్ వసూళ్లలో జోరు.. ఫస్ట్ వీకెండ్ ఎంత రాబట్టింది అంటే?
Also Read: Prabhas -Maruthi: ప్రభాస్-మారుతి మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook