Mufasa: ‘ముఫాసా’: ది లయన్ కింగ్` కోసం కుమారులతో సహా రంగంలోకి దిగిన షారుఖ్..
Mufasa: హాలీవుడ్ చిత్రాల్లో ‘ది లయన్ కింగ్’ చిత్రానికి ఎంతో మంది అభిమానులున్నారు. తాజాగా ఈ సినిమాలో భాగంగా ‘ముఫాసా’ సినిమా రాబోతుంది. పలు భారతీయ భాషల్లో రాబోతున్న ఈ చిత్రానికి పలువురు సెలబ్రిటీలు డబ్బింగ్ చెబుతున్నారు. హిందీ కోసం షారుఖ్ తో పాటు ఆయన కుమారులు రంగంలోకి దిగారు.
Mufasa: ‘లయన్ కింగ్’ సినిమాలో భాగంగా త్వరలో ‘ముఫాసా’ సినిమా రాబోతుంది. ఈ సినిమాను ఈ యేడాది డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లీష్ సహా వివిధ ప్రాంతీయ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.అంతేకాదు ఆయా భాషల్లో ఈ సినిమాకు క్రేజ్ తీసుకురావడానికి ఆయా భాషల్లో స్టార్ హీరోలతో ఈ సినిమాలోని పాత్రలకు డబ్బింగ్ చేయిస్తున్నారు. ఈ కోవలో హిందీలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి షారుఖ్ ఖాన్ తో పాటు ఆయన కుమారులు ఆర్యన్, అబ్ రామ్ డబ్బింగ్ చెప్పబోతున్నట్టు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ సినిమాను వాల్డ్ డిస్నీ నిర్మిస్తోంది. అడివిలో ఓ మృగరాజు.. ఆయన వారసుల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఆ వారసుడు ముసాఫాను అంతం చేయడానికి ప్రత్యర్థులు చేసే కుట్రలు. వాటిని చేదించుకుంటూ ఎలా తన సామ్రాజ్యానికి రాజయ్యడనేది ఎంతో ఇంట్రెస్టింగ్ పాయింట్. ‘ముఫాసా’ హిందీ వెర్షన్ కోసం లయన్ కింగ్ పాత్రకు షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెబుతున్నాడు. అతని పిల్లలు సింబకు ఆర్యన డబ్బింగ్ చెబుతుంటే.. టైటిల్ రోల్ చేస్తోన్న ‘ముఫాసా’ పాత్రకు షారుఖ్ ఖాన్ రెండో కుమారుడు అబ్రమ్ చెబుతుండటం విశేషం.
హాలీవుడ్‌లో బ్లాక్ బస్టర్ లెగసీ తో ఈ సినిమా రాబోతుంది. అంతేకాదు ఈ సినిమాను ఈ యేడాది డిసెంబర్ 20న రిలీజ్ చేస్తున్నారు. ప్రైడ్ లాండ్స్ లో ముఫాసా ఎలా ఎదిగాడు. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసాడు. ఈ సిరీస్‌లో ఎలా ఉండబోతుందనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ప్రపంచ వ్యాప్తంగా 'ది లయన్ కింగ్' మూవీ చిత్రానికి సెపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. 1994లో యానిమేషన్ భాగంలో ఈ సినిమా తెరకెక్కింది. ఆ సినిమా సక్సెస్ తర్వాత మరోసారి 3D యానిమేషన్‌లో 2019లో రిలీజ్ చేస్తే అది బ్లాక్ బస్టర్ గా నిలిచింది.
'కింగ్'.. 'ముఫాసా' కథతో బేస్ చేసుకొని ప్రైడ్ లాండ్స్‌లో భాగంగా ఒక కింగ్ గా ఎలా ఎదిగాడనే కాన్సెప్ట్ తో మ‘ముఫాసా’ను తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన మూవీ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. హిందీలో షారుఖ్ ఖాన్ గొంతు ఈ సినిమాకు పెద్ద ఎస్సెట్ గా నిలవనుంది. ఈ మూవీని బ్యారీ జెంకిన్స్ డైరెక్ట్ చేస్తున్నారు. ప్రేక్షకులకు మంచి టిక్ ఫీలింగ్ కలిగేలా లైవ్ యాక్షన్ ఫిలిం మేకింగ్ టెక్నిక్‌తో ఈ చిత్రాన్ని ఫోటో రియల్ కంప్యూటర్ జనరేటెడ్ ఇమేజెరీలో తెరకెక్కించడం విశేషం. ఈ మానియాని ఎంజాయ్ చెయ్యడానికి ప్రేక్షకులు డిసెంబర్ 20 వరకు వెయిట్ చేయక తప్పదు.
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter