Mumbai Police Arrested Kamal Rashid Khan and Sent to 14 days Judicial Custody: 2020లో వివాదాస్పద ట్వీట్ చేసినందుకు గాను బాలీవుడ్ స్వయం ప్రకటిత క్రిటిక్ కమల్ రషీద్ ఖాన్‌ను ముంబైలోని మలాడ్ పోలీసులు ఈరోజు అరెస్టు చేశారు. ముంబై ఎయిర్‌పోర్టులో దిగిన వెంటనే ఆయనను అరెస్టు చేశారు. ఆయనను మంగళవారం బోరివలి కోర్టులో హాజరు పరిచారు. అందుతున్న సమాచారం ప్రకారం, కమల్ ఆర్ ఖాన్‌ను బోరివాలి కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దీంతో ఇప్పుడు  కమల్ ఆర్ ఖాన్‌ 14 రోజులు జైలులో ఉండవలసి ఉంటుంది. అయితే కోర్టు నిర్ణయం వెలువడిన తర్వాత, కమల్ ఆర్ ఖాన్ ఆలస్యం చేయకుండా బెయిల్ దరఖాస్తు దాఖలు చేశారు. బోరివలి కోర్టులోనే సాయంత్రం 4 గంటలకు బెయిల్ పిటిషన్ విచారణ జరగనుందని తెలుస్తోంది. అయితే కేఆర్‌కేకి బెయిల్ వస్తుందో, లేదంటే 14 రోజులు జైల్లో ఉండాల్సి ఉంటుందో కోర్టు విచారణ తర్వాతే తేలనుందని అంటున్నారు. మలాడ్ పోలీసులు మొదట కమల్ ఆర్ ఖాన్‌ను విమానాశ్రయం నుండి అదుపులోకి తీసుకుని, విచారణ తర్వాత అతన్ని అరెస్టు చేశారు.


అందుతున్న సమాచారం ప్రకారం, 2020 సంవత్సరంలో నమోదైన కేసులో కమల్ ఆర్ ఖాన్‌ను అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో మతం గురించి వివాదాస్పద ట్వీట్లు చేస్తున్నాడని కమల్ ఆర్ ఖాన్‌ మీద ఫిర్యాదు నమోదయింది.  యువసేన సభ్యుడు రాహుల్ కనాల్ కేఆర్కేపై ఫిర్యాదు చేశారు. దీంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత 2020లో కమల్ ఆర్ ఖాన్‌పై లుక్‌అవుట్ నోటీసు జారీ చేయబడింది. దివంగత నటులు రిషి కపూర్ సహా ఇర్ఫాన్ ఖాన్‌లపై కెఆర్‌కె అవమానకరమైన ట్వీట్లను పోస్ట్ చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. క


మల్ ఆర్ ఖాన్‌ను మలాడ్ పోలీసులు ఐపీసీ 153A, 294,500, 501,505, 67/98 చట్టం కింద అరెస్టు చేశారు. ఇక ఈ కేసులో బెయిల్ వస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. బాలీవుడ్ నటులు ఇర్ఫాన్ ఖాన్, రిషి కపూర్‌లపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరి మరణం తరువాత,  కమల్ ఆర్ ఖాన్‌ 'కొంతమంది ప్రసిద్ధ వ్యక్తులను వారితో తీసుకెళ్లే వరకు కరోనా పోదని నేను కొన్ని రోజుల క్రితం చెప్పాను' అని పేర్కొన్నారు.


ఈ క్రమంలోనే ఈ ట్వీట్ మీద త, 2020లో కమల్‌పై, యువసేన కోర్ కమిటీ మలాడ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. అయితే కమల్ ఆర్ ఖాన్‌ ఇబ్బందుల్లో పడటం ఇదే మొదటిసారి కాదు. తన వివాదాస్పద ట్వీట్ల ద్వారా తరచూ ఆయన వార్తల్లో ఉంటాడు. కమల్ ఆర్ ఖాన్‌ ఎప్పుడూ ఏదో ఒక సినిమాపైననో,లేక నటీనటులపైనో వ్యాఖ్యానిస్తూనే ఉంటాడు. ఈ కారణాలతో ఇంతకు ముందు కూడా కమల్ ఆర్ ఖాన్‌ పై పరువునష్టం కేసు నమోదైంది. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ అతడిపై కేసు కూడా పెట్టారు.  
Also Read: Ram Charan shelved Gowtam Movie:గౌతంకు షాకిచ్చిన రామ్ చరణ్.. అన్నీ ఓకే అనుకున్నాక రెడ్ సిగ్నల్!


Also Read: Liger Movie 5 Days Collections: ఐదో రోజు 80% డ్రాప్.. తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ దిశగా పరుగులు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి