Liger Movie 5 Days Collections: ఐదో రోజు 80% డ్రాప్.. తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ దిశగా పరుగులు!

Liger Movie 5 Days Collections World Wide: జయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా నటించిన తాజా చిత్రం లైగర్ ఐదు రోజుల కలెక్షన్స్ రిపోర్టు ఇప్పుడు చూద్దాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 30, 2022, 02:07 PM IST
Liger Movie 5 Days Collections: ఐదో రోజు 80% డ్రాప్.. తెలుగు రాష్ట్రాల్లో డిజాస్టర్ దిశగా పరుగులు!

Liger Movie 5 Days Collections World Wide: పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్గా నటించిన తాజా చిత్రం లైగర్. కరోనా కంటే ముందే ప్రారంభించిన ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయింది. ఎట్టకేలకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్సాఫీస్ వసూళ్ల మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తోంది.

మొదటిరోజు టాక్ తో సంబంధం లేకుండా కేవలం తెలుగు రాష్ట్రాలలోనే తొమ్మిది కోట్ల 57 లక్షల వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు కోటి 54 లక్షలకు పడిపోయింది. మూడో రోజు కోటి రూపాయలకు, నాలుగో రోజు 55 లక్షలకు  పడిపోయింది. ఐదో రోజు అయితే మరీ దారుణంగా 12 లక్షలు మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో వసూలు చేయగలిగింది. ఈ నేపద్యంలో ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో లైగర్ సినిమా 12 కోట్ల 81 లక్షలు షేర్ 21 కోట్ల 80 లక్షల గ్రాస్ వసూలు చేసింది.

కర్ణాటక సహా మిగతా భారతదేశం మొత్తంలో కోటి 47 లక్షలు ఇతర భాషలలో 77 లక్షల వసూలు చేసిన ఈ సినిమా నార్త్ ఇండియాలో ఆరు కోట్ల 75 లక్షలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకు మూడు కోట్ల 34 లక్షల షేర్ లభించింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే పాతిక కోట్ల 14 లక్షలు షేర్, 52 కోట్ల 45 లక్షల కోట్లు సాధించినట్లయింది. ఈ సినిమా మొత్తం మీద 88 కోట్ల 40 లక్షల రూపాయలకు బిజినెస్ జరుపుకుంది.

ఈ నేపద్యంలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా 90 కోట్ల రూపాయలను నిర్ణయించారు. ఆ లెక్కన సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించాలి అంటే 64 కోట్ల 86 లక్షలు వసూలు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంత వసూలు చేయడం అనేది అసాధ్యమే అని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల కంటే హిందీలో ఈ సినిమాకి ఆదరణ లభిస్తూ ఉండడం ఆసక్తికరమైన విషయం. తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో సినిమా యూనిట్ తెలుగు రాష్ట్రాల్లో మరోసారి ప్రమోషనల్ టూర్ ప్లాన్ చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండ దుబాయ్ క్రికెట్ మ్యాచ్ లో కూడా సినిమాని ప్రమోట్ చేసి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యారు.
Also Read: New Villian in Pushpa the Rule: పుష్ప 2 కోసం సుకుమార్ నయా ప్లాన్.. రంగంలోకి పవర్ ఫుల్ విలన్!

Also Read: NBK 107 plot twist revealed: ఎన్బీకే 107 మూవీ కథ ప్లాట్ లీక్..అసలు కథ దాని చుట్టూనే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News