Allu Arjun: అల్లు అర్జున్ ని నేషనల్ అవార్డుకి.. టాలీవుడ్ ఎందుకు సత్కరించలేదు..సీనియర్ హీరో కీలక వ్యాఖ్యలు!
Murali Mohan: పుష్ప మూవీ తర్వాత అల్లు అర్జున్ వరల్డ్ వైడ్ పాపులారిటీ సంపాదించారు. ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్న అల్లు అర్జున్ ను తెలుగు పరిశ్రమ తగురీతిలో సత్కరించలేదు అని మురళీమోహన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో పుష్ప మూవీ ఓ మరపురాని మైలురాయిగా మిగిలిపోయింది. ఈ మూవీ తర్వాత ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా పలు అవార్డులను కూడా అందుకున్నాడు అల్లు అర్జున్. అందులో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా అల్లు అర్జున్ కు దక్కింది. గత 69 ఏళ్లుగా ఈ బెస్ట్ యాక్టర్ అవార్డు అన్నది టాలీవుడ్ లో ఓ తీరని కలల అందరిని ఊరిస్తూ ఉండేది. అలాంటి కల అల్లు అర్జున్ వల్ల సాకారం అయ్యింది. అయితే ఇంత అరుదైన రికార్డును తెలుగు సినీ ఇండస్ట్రీకి సాధించి పెట్టిన అల్లు అర్జున్ ను ఎంతోమంది అభినందించారు.
అయితే ఇంత గొప్ప పురస్కారం తెచ్చుకున్న అల్లు అర్జున్ ను సినీ ఇండస్ట్రీ తగురితిన సత్కరించలేదు అని మురళీమోహన్ అభిప్రాయపడ్డారు. ఎన్నో ఏళ్లుగా కలలా ఉన్న ఒక అద్భుతాన్ని సాధించిన వ్యక్తిని కాస్త ప్రత్యేకంగా సత్కరించాల్సిన అవసరం ఉంది. అయితే ఈ విషయంపై ఇండస్ట్రీ వ్యక్తులు స్పందించకపోవడం కాస్త అసంతృప్తిగా ఉంది అన్నారు మురళీమోహన్. మార్చి 22న సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ ఈవెంట్ లో పాల్గొన్న మురళీమోహన్ ఈ విషయం గురించి మాట్లాడా. అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చినప్పుడు ఎందుకని చిత్రసీమ ప్రముఖులు సన్మానించలేదు? అని మురళీమోహన్ ప్రశ్నించారు.
కనీసం మెగాస్టార్ అయిన అల్లు అర్జున్ ని సత్కరించడం సంతోషకరంగా ఉంది. శని ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నప్పుడు మా మధ్య ఇటువంటి భేదాలు ఉండేవి కాదు. అప్పుడు పరిస్థితి ఎంతో భిన్నంగా ఉండేది అని మురళీమోహన్ ఇండస్ట్రీలో జరుగుతున్న అంతర్గత రాజకీయాలపై తన అసహనాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. ఇక వీటిపై సినీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. నేషనల్ అవార్డు పొందిన సందర్భంగా అల్లు అర్జున్ మైనపు ప్రతిమ ప్రపంచ ప్రఖ్యాతి మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మార్చి 28న ఆవిష్కరిస్తారు. ప్రపంచం మొత్తం అల్లు అర్జున్ టాలెంట్ ను గుర్తించినప్పటికీ.. తెలుగు ఇండస్ట్రీ సినీ పెద్దలకు మాత్రం అతన్ని సత్కరించాలి అన్న ఉద్దేశం ఎందుకు కలగడం లేదు అంటూ నెటిజెన్లు ప్రశ్నిస్తున్నారు.
Also Read: మందుబాబులకు వెరీ బ్యాడ్ న్యూస్.. వైన్స్, బార్లు, పబ్‌లు బంద్
Also Read: ఆదివారం కూలీగా బిల్డప్.. ఏసీబీకి చిక్కిన మహిళా ఆణిముత్యం సబ్ రిజిస్ట్రార్ తస్లీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి