Tragedy at Anirudh`s Home: అనిరుధ్ ఇంట తీవ్ర విషాదం.. ఏమైందంటే?
Music Director Anirudh Ravichander`s grandfather, Veteran Director Sv Ramanan Passes Away: తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆ వివరాల్లోకి వెళితే
Music Director Anirudh Ravichander's grandfather, Veteran Director Sv Ramanan Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అనిరుద్ రవిచందర్ తాత ఎస్వీ రమణన్ అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు ప్రస్తుతం 87 సంవత్సరాలు. వయోభారం రీత్యా ఏర్పడిన అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు.
ఎస్వీ రమణన్ మృతితో తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన రమణన్ రేడియో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తర్వాతి కాలంలో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. రమణన్ తండ్రి సుబ్రహ్మణ్యం 1940లలోనే పలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఇక రమణన్ రేడియోలో అనేక కార్యక్రమాలకు డబ్బింగ్ చెప్పేవారు. అలాగే దర్శకుడిగా మారి కొన్ని డాక్యుమెంటరీలు రూపొందించారు.
1983వ సంవత్సరంలో ఆయన ‘ఊరువంగల్ మరాళం’ అనే సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో మహేంద్రన్, సుహాసిని హీరో హీరోయిన్లుగా నటించగా కమల్ హాసన్, రజనీకాంత్ వంటి వారు అతిథి పాత్రలలో కనిపించారు. రమణన్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు వారు లక్ష్మీ,పార్వతి. అందులో లక్ష్మీ కుమారుడే ఇప్పటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్. అనిరుద్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా ఎంటరై తమిళ సినీ పరిశ్రమలో టాప్ స్థాయికి చేరుకున్నారు.
ఇక ఎస్వీ రమణన్ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం చెన్నైలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 90 లలో అనేక అడ్వర్టైజ్మెంట్లకు సైతం రమణన్ గాత్ర అందించారు. రమణన్ కేవలం దర్శకుడిగానే కాక సంగీత దర్శకుడిగా కూడా వ్యవహరించారు. ఆయన సంగీతం అందించిన మన్యం అనే సినిమా 2018 లో విడుదలైంది, ఇవి కాక ఆయన అనేక నాటికలకు, నాటకాలకు కూడా సంగీతం అందించారు. ఆయన తమిళ సినీ పరిశ్రమలో రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా, సన్నిహిత దర్శకుడిగా వ్యవహరించారు. ఆయనకు తమిళ సినీ పరిశ్రమలో మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా పేరు ఉంది.
Also Read: Sanjay Dutt in Prabhas Film: ప్రభాస్ సినిమాలో సంజయ్ దత్.. మాములుగా ప్లానింగ్ కాదుగా ఇది!
Also Read: NBK 107 Video Leaked: ఎన్బీకే 107 నుంచి వీడియో లీక్.. పప్పులో కాలేశారా.. ఇదెక్కడి లాజిక్ రా అయ్యా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook