AR Rahman: ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇంట శుభకార్యం జరిగింది. రెహమాన్ పెద్ద కుమార్తె ఖతీజా రెహమాన్ నిశ్చితార్దం అత్యంత ఘనంగా జరిగింది. ఇంతకీ వరుడు ఎవరో తెలుసా


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఖతీజా రెహమాన్. ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ పెద్ద కుమార్తె. తమిళ రోబో సినిమాలో గాయనిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె నిశ్చితార్ధం అత్యంత ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించింది. వరుడు ఎవరనేది కూడా అభిమానులకు పరిచయం చేసింది. ఆడియో ఇంజనీర్, బిజినెస్ మెన్ రియాజుద్దీన్ షేక్ మహ్మద్‌తో నిశ్చితార్ధం జరిగింది. పెళ్లి అంటే నిఖా ఎప్పుడనేది ఇంకా నిర్ణయం కాలేదు. చెన్నైలో ఎవరికీ తెలియకుండా ఈ నిశ్చితార్ధం జరిగింది. పరిమిత సంఖ్యలో కేవలం కుటుంబసభ్యులు, బంధువులు మాత్రమే హాజరయ్యారు. అందుకే నిశ్చితార్ధం ఫోటోలు బయటకు రాలేదు. ఖతీజా రెహమాన్ (Khatija Rehman Engagement) స్వయంగా ఫోటో షేర్ చేయడంతో ఈ విషయం కాస్తా వైరల్ అయింది. 


ఏఆర్ రెహమాన్ (AR Rehman) కుమార్తె ఖతీజా రెహమాన్ ఇప్పటికే తమిళ రోబో సినిమా ఎందిరన్‌లో పాటతో అందరికీ పరిచయమైంది. ఆ తరువాత ఫరిష్టోన్ ఆల్బమ్‌తో ప్రాచుర్యం పొందింది. ఈ ఆల్బమ్‌కు బెస్ట్ యానిమేషన్ గుర్తింపు లభించింది. చిన్న కుమార్తె రహిమా కూడా బాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ఘంగా ఉందని తెలుస్తోంది. ఇప్పటికే నటనలో శిక్షణ తీసుకుంది. ఇక ఖతీజా నిశ్చితార్ధానికి నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


Also read: Sara Tendulkar journey : మెడిసిన్‌ నుంచి మోడల్‌ దాకా సారా టెండూల్కర్ జర్నీ..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook