Sara Tendulkar journey : మెడిసిన్‌ నుంచి మోడల్‌ దాకా సారా టెండూల్కర్ జర్నీ..

Sara Tendulkar journey from medicine graduate to model : క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. సారాకు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.5 మిలియన్లకు పైగా ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ ఉంది.

  • Jan 02, 2022, 21:38 PM IST

Sachin Tendulkar daughter Sara Tendulkar journey from medicine graduate to model: సారా లండన్ విశ్వవిద్యాలయంలో మెడిసిన్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 24 ఏళ్ల ఆమె మోడలింగ్‌లోకి తాజాగా మోడలింగ్‌లో అడుగుపెట్టింది. సారా జర్నీపై ఒక లుక్కేద్దాం పదండి.

1 /7

క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో శుభ్‌మాన్ గిల్‌తో.. సారా రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి. సారా అతనితో డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ పుకార్లపై వారిద్దరూ కూడా స్పందించలేదు.

2 /7

సారా టెండూల్కర్ ఆ పేరు పెట్టడం వెనుకు ఒక కారణం ఉందట. సారా. తండ్రి సచిన్ టెండూల్కర్ 'సహారా కప్' గెలిచిన తర్వాత.. సారా పుట్టడడంతో ఆమెకు సహారా కలిసేలా ఉండే పేరు పెట్టాలనుకున్నారట. అందుకే సారా అని పెట్టారట.

3 /7

సారా ఇటీవల ప్రముఖ డ్రెసెస్‌ బ్రాండ్ కోసం మోడలింగ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రమోషనల్ మోడలింగ్ వీడియో కూడా పోస్ట్ చేసింది సారా. ఆ వీడియో వైరల్‌గా మారింది.

4 /7

సారా అందంగా తయారు కావడానికి ఇష్టపడుతూ ఉంటుంది. తన ఫేస్‌లో ఎప్పుడూ చిరునవ్వు ఉండేలా చూసుకుంటూ ఉంటుంది ఈ బ్యూటీ. 

5 /7

సారా.. ధీరూబాయి అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసింది. తర్వాత గ్రాడ్యుయేషన్ చేయడానికి లండన్ వెళ్ళింది. సారా లండన్‌లోని యూనివర్శిటీ కాలేజీలో మెడిసిన్ చదివింది. ఆమె తల్లి అంజలి కూడా డాక్టర్.  

6 /7

సారాకు విహారయాత్రలు అంటే చాలా ఇష్టం. వరల్డ్ టూర్ అంటే తనకు చాలా ఇష్టం. సారా ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇండోనేషియా, దుబాయ్ తో పాటు పలు దేశాల్లో పర్యటించింది.

7 /7

సారా తన తండ్రి సచిన్ టెండూల్కర్‌తో చాలా సన్నిహితంగా ఉంటుంది. వారిద్దరూ ఎన్నో విషయాలను పంచుకుంటూ ఉంటారు.