Keeravani Strong counter to Rasool Pookutty: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎంత సూపర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్ తేజ ఎన్టీఆర్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా సుమారు 1130 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. అయితే తాజాగా ఈ సినిమా ఒక గే సినిమా అంటూ ఆస్కార్ అవార్డు గ్రహీత, సౌండ్ ఇంజనీర్ రసూల్ పూకుట్టి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. దీనిమీద బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ కూడా ఘాటుగానే స్పందించారు. అది గే స్టోరీ కాదు, ఒకవేళ అది గే స్టోరీ అయితే మాత్రం తప్పేంటి అని ప్రశ్నించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దానికి రసూల్ కూడా స్పందిస్తూ అది గే స్టోరీ అని నేను అనడం లేదని ఆల్రెడీ పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఉన్న విషయాన్ని నా స్నేహితుడికి చెబుతున్నానని ఇందులో నేను సినిమానేమీ కించపరచడం లేదు నువ్వు కూల్ అవ్వాలంటూ రసూల్ కామెంట్స్ చేశాడు. అయితే రసూల్ కామెంట్స్ మీద అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా సంగీత దర్శకుడు కీరవాణి ఒక ట్వీట్ చేయడంతో అది పెద్ద దుమారాన్ని లేపింది. తనకు అప్పర్ కేసు లెటర్స్ లోయర్ కేసు లెటర్స్ ఎక్కడ వాడాలో సరిగా తెలియదు అంటూనే రసూల్ పేరు టైప్ చేసి అందులో తెలుగులో ఒక బూతు అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. 


కొంతసేపటికి అది డిలీట్ చేశారు కానీ ఆ విషయం మీద ఇప్పుడు పైన దుమారం రేగుతోంది. కీరవాణి లాంటి సంగీత విద్వాంసుడు ఇలా బూతు పదాన్ని వాడటం ఏ మాత్రం కరెక్ట్ కాదని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. వరి కొంతమంది మాత్రం ఎన్నో రాత్రులు కష్టపడి ఒక ప్రోడక్ట్ చేసి వదిలిన తర్వాత ఇలాంటి దరిద్రమైన కామెంట్స్ వస్తుంటే కొందరు మాత్రం ఆయనని సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఒక సినిమా కోసం అహోరాత్రాలు కష్టపడి ఒక రూపు తీసుకు వస్తే ఇలా ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడితే దాన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదని బహుశా అందుకే కీరవాణి ఇలా స్పందించి ఉండొచ్చు అని అంటున్నారు. 


అయితే కీరవాణి ట్వీట్ డిలీట్ చేసిన తర్వాత కూడా ఈ వ్యవహారం మీద ట్వీట్లు చేస్తూనే ఉన్నారు కొంతమంది. అయితే ట్వీట్ డిలీట్ చేసిన తరువాత కూడా ఆయన మళ్ళీ తనకు ఉన్న టైపింగ్ డిఫెక్ట్ పోయిందని, కొత్తగా క్యారెక్టర్ బ్లైండ్‌నెస్‌ వచ్చిందని చెబుతూ సినిమాలో తనకు రామ్, భీమ్ క్యారెక్టర్లు కనిపించడం లేదని.. దేశభక్తుడు అయినటువంటి అజయ్ దేవగన్ పాత్ర ఒక్కటే కనిపిస్తుంది అని ట్వీట్లు చేశారు. అయితే ఈ వివాదం ఎంత దూరం వెళుతుంది అనేది చూడాల్సి ఉంది.
Also Read: Editor Gautham Raju: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ ఎడిటర్ గౌతమ్ రాజు కన్నుమూత..


Also Read: Godfather Poster: 'గాడ్‌ ఫాదర్' నుంచి మరో పోస్టర్.. రియల్ గ్యాంగ్‌స్టర్ వచ్చేశాడు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook