Sri Vasanth: రచయితగా మారిన పాపులర్ సంగీత దర్శకుడు.. థియేటర్స్ లో అల్లరిస్తున్న మహారాజా !!!
Sri Vasanth: అల్లరి నరేష్ సుడిగాడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగీత దర్శకుడు శ్రీ వసంత్. ప్రస్తుతం ఈ దర్శకుడు రచయితగా కూడా మారనున్నాడు. ఇంతకీ ఏ సినిమాకి అనేది.. ఒకసారి చూద్దాం పదండి..
Vijay Sethupathi Maharaja: అల్లరి నరేష్ సుడిగాడు సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే
ఈ సినిమాతో సంగీత దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ వసంత్. ఈ సంగీత దర్శకుడు పలు సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న.. విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా.. నిధిలన్ స్వామినాథన్ డైరెక్షన్ లో సుదర్శన్ సుందరం, జగదీష్ ఫళనిస్వామి.. ప్రొడ్యూసర్స్ గా.. జూన్ 14న విడుదలైన చిత్రం మహారాజ. ఈ చిత్రానికి శ్రీ వసంత్ పాటలు, మాటలు రాశారు.
మహారాజ సినిమాలోని "అమ్మ నీకే నాన్నయ్యనా" ..అంటూ సాగే పాటలు శ్రీ వసంత్ స్వరాలు బాగా ఫేమస్ అయ్యాయి, అజనీస్ లోకనాధ్ సంగీతం పాటకు మరో బిగ్ పాజిటివ్ పాయింట్ గా నిలిచింది. మహారాజ సినిమాకు విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూ సొంతం చేసుకుంటోంది, అలాగే మహారాజ రివ్యూస్ లో మాటలు, పాటల గురించి కూడా సినిమా చూసిన వారు ఎంతో మెచ్చుకుంటున్నారు.
విజయ్ సేతుపతి 50వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మహారాజ సినిమా ఆసక్తికరమైన క్రైమ్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి మంచి సినిమాకు మాటలు, పాటలు రాయడం సంతోషాన్ని కలిగిస్తుందని శ్రీ వసంత్ తెలిపారు.
శ్రీ వసంత్ స్వీయ డబ్బింగ్ కంపెనీ "పోస్ట్ ప్రో మీడియా వర్క్స్" లో మాజరాజ సినిమాని డబ్ అవ్వడం జరిగింది. అలాగే నిఖిల్ హీరోగా నటించి.. మంచి విజయం సాధించిన కార్తికేయ 2 కూడా పోస్ట్ ప్రో మీడియా వర్క్స్ లో డబ్ అవ్వడం విశేషం.
మొత్తం పైన మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా.. ఇలా రచయితగా మారి..మాటల మాంత్రికుడుగా కూడా అలరిస్తున్నారు శ్రీ వసంత్..
Read more: Viral video: ఒరేయ్.. ఎవర్రా మీరంతా.. వర్షం బురద నీళ్లను వదలరా.. వైరల్ గా మారిన వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter