Music Director thamans humanity: సాధారణంగా జీవితంలో చాలా వరకు అందరు మంచి పోజిషన్ లోకి ఎదుగుతుంటారు. కానీ కొంత మంది మాత్రం.. ఎక్కడ నుంచి వచ్చాము.. మనం ఏదైన సమాజానికి చేయాలని అనుకుంటారు. కానీ మరికొందరు మాత్రం స్వార్థపూరీతంగా ఆలోచిస్తుంటారు. సహాయం చేసే పొజిషన్ లో ఉన్న కూడా ఎవర్నీ పట్టించుకోరు. మరికొందరు మాత్రం  సమాజంలో తాము.. తమ వంతుగా ఏదైన చేస్తుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఆర్టీసీ ఎండీ సజ్జనార్ బస్సులొ ఒక దివ్యాంగుడి పాటకు ఫిదా అయ్యారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయనకు ఏదైన అవకాశం ఇవ్వాలన ఎక్స్ లో కీరవాణిగారికి ట్యాగ్ చేశారు. దీనిపై ఇప్పటి వరకు కీరవాణి స్పందించనట్లు సమాచారం. కానీ తమన్ మాత్రం.. తెలుగు ఇండియన్ ఐడల్ లో చాన్స్ ఇస్తానని చెప్పారు. అయితే.. ప్రస్తుతం.. తమన్ మళ్లీ వార్తలలో నిలిచారు.


మ్యూజిక్ డైరెక్టర్ తమన్..ఒక వైపు సినిమాల్లో క్రేజీ సంగీతాన్ని ఇస్తునే, మరొవైపు కొన్ని షోలల్లో న్యాయనిర్ణేతగా కూడా పనిచేస్తున్నారు. ఇటీవల కాలంలో ఆయన మాత్రం తెగ హల్ చల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా తమన్ మరోసారి గొప్ప మనసు చాటుకున్న విషయం ప్రస్తుతం వైరల్ గామారింది..  కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీ అవసరం అయిన పేషంట్ కి తమన్ సాయం అందించినట్లు తెలుస్తొంది. ఈ విషయాన్ని డాక్టర్ లీలా కృష్ణ సోషల్ మీడియాలో తెలియజేశారు.  


Read more: Naga Chaitanya - Sobhita: నాగచైతన్య-శోభితల పెళ్లిపై నాగార్జున యూటర్న్‌..?.. బాంబు పేల్చిన మరో సిద్ధాంతి.. అసలేం జరిగిందంటే..?


తమన్ గొప్ప మనసుని ఆయన అభినందించారు. అంతే కాకుండా.. ఒక నిండు ప్రాణాం బతికేలా చేశావని నీ మంచి మనస్సకు దేవుడు ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లోని ఐను హాస్పిటల్స్ లో ఈ చికిత్స జరిగింది. ప్రస్తుతం.. సోషల్ మీడియాలో తమన్ ను.. నెటిజన్లు అభినందిస్తున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.