Theri Remake Update: పవన్ కళ్యాణ్‌ హరీష్‌ శంకర్ మైత్రీ మూవీస్ కాంబోలో ఎప్పుడో ఓ సినిమా రావాల్సిందే. గత మూడు నాలుగేళ్లు ఈ ప్రాజెక్ట్ ముందుక్కి వెనక్కి జరుగుతూనే ఉంది. హరీష్‌ శంకర్ సపరేట్‌గా ఓ కథ రాసుకున్నాడు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దీంతో హరీష్‌ శంకర్ నెత్తి మీద తేరీ సినిమాను తీసుకొచ్చి పెట్టారు. దాన్ని రీమేక్ చేసే బాధ్యతలు హరీష్‌ భుజాన పడింది. దీంతో చేసేదేం లేక హరీష్‌ శంకర్ తేరిని తెలుగీకరిస్తున్నాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే ఈ క్రమంలో హరీష్‌ శంకర్ తేరీకి చాలానే మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. తేరీలో ముఖ్యంగా విజయ్, తన పాప చుట్టూ ఉండే ట్రాక్ ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ పాప కారెక్టర్‌నే లేపేస్తోన్నట్టుగా తెలుస్తోంది. ఆ పాప కారెక్టర్‌ను తమిళంలో మీనా కూతురు చేసిన సంగతి తెలిసిందే. తెలుగులోకి వచ్చే సరికి ఆ పాత్రను ఓ బుడ్డోడి కారెక్టర్‌గా మార్చేస్తున్నారట.


ఈ మేరకు మైత్రీ మూవీస్ కాస్టింగ్ కాల్‌ను ప్రకటించింది. ఓ చిన్న పిల్లాడి కోసం ఈ ప్రకటన చేశారు. అయితే ఇది తేరీ రీమేక్‌ కోసమే చేశారని, పాప కారెక్టర్‌ను బాబు కారెక్టర్‌గా మార్చేశారని నెటిజన్లు అంటున్నారు. అయితే ఇదే విషయం మీద హరీష్‌ శంకర్ స్పందించాడు. అలాంటిదేమీ లేదన్నట్టుగా మాట్లాడాడు. అంతే కాకుండా ఒరిజినల్‌ సినిమాలో విజయ్ బేకరీలో పని చేస్తుంటే.. ఇందులో మాత్రం లెక్చరర్‌గా పని చేస్తాడని కూడా అంటున్నారు. 



హరీష్‌ శంకర్ ఆ రూమర్లను కూడా కొట్టిపారేశాడు. మొత్తానికి హరీష్‌ శంకర్ మాత్రం ఈ సినిమా కోసం భారీ మార్పులు చేర్పులు చేస్తున్నట్టుగానే తెలుస్తోంది. గబ్బర్ సింగ్ స్టైల్లోనే ఈ సినిమాను కూడా తీస్తున్నట్టుగా కనిపిస్తోంది. అందులోనూ పోలీసే ఇందులోనూ పోలీస్ పాత్ర అవ్వడంతో మరింత మాసీగా సీన్లను ప్రిపేర్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.


ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ వినోదయ సిత్తం, హరిహర వీరమల్లు వంటి సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఆ తరువాతే ఈ సినిమాను పట్టాలెక్కిస్తాడనిపిస్తోంది. ఇది కాకుండా మధ్యలో సుజిత్ సినిమా కూడా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. ఇవన్ని ఎప్పుడు పూర్తవుతాయో చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కావడం లేదు.


Also Read:  Allu Arjun Silence on Naatu Naatu : నాటు నాటుకు ఆస్కార్.. రగిలిపోతోన్నాడా?.. నోరు విప్పని అల్లు అర్జున్


Also Read: Chiranjeevi Twitter DP : డీపీ మార్చిన చిరంజీవి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook