Prabhas Kalki: సీతారామం సినిమాతో తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సీతగా.. నూర్ జాహాన్ గా రెండు విభిన్నమైన షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించి అందరిని ఫిదా చేసింది. ఆ తరువాత నాని హీరోగా చేసిన హాయ్ నాన్న చిత్రంలో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలో కనిపించి మరోసారి సూపర్ హిట్ అందుకుంది. వరసగా రెండు విజయాలు రావడమే కాకుండా ఈ హీరోయిన్ మంచి పాత్రలే ఎంచుకుంటుంది అని ప్రేక్షకుల మదిలో చెరగని ఒక అభిప్రాయాన్ని కూడా వేసేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈమె హీరోయిన్ గా రాబోతున్న విజయ్ దేవరకొండ సినిమా ఫ్యామిలీ స్టార్ పై అంచనాలు భారీగా పెరిగాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇలా వరస సినిమాలతో అలరిస్తున్న మృణాల్ ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్టు కూడా సంపాదించుకుంది అని వినికిడి. ప్రస్తుతం రాబోతున్న పాన్ ఇండియా సినిమాలలో ప్రత్యేక స్ధానం సంపాదించుకున్న సినిమా కల్కి 2898AD. మహానటి లాంటి అద్భుతమైన చిత్రం తెరకెక్కించిన నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా చేస్తున్న.. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది.


ఈ సినిమాలో ఇప్పటికే భారీ తారాగణం భాగమై అన్ని.. భాషల ప్రేక్షకులకి ఈ చిత్రంపై అంచనాలను పెంచేశారు. అమితాబ్ బచ్చన్, దీపిక పడుకొనే, కమల్ హాసన్, దుల్కర్ సల్మాన్ లాంటి వారి పేర్లు ఇప్పటికే అఫీషియల్ గా కన్ఫామ్ కాగా ప్రస్తుతం ఈ చిత్రంలో మృనాల్ సైతం ఒక కీలక పాత్రలో కనిపించనుంది అని తెలుస్తుంది. 


ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్నప్పటికీ హిందూ మైథలాజి బ్యాక్ డ్రాప్ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది అని ఈ సినిమా టీజర్ విడుదలైన దగ్గర నుంచి వార్త ప్రచారం సాగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలో ప్రభాస్.. మహా విష్ణు దశావతారంలోని కల్కి పాత్రని పోషిస్తున్నట్లు, అలాగే మన ఇతిహాసాల్లో చెప్పబడిన ఏడుగురు చిరంజీవులు పాత్రలను కూడా చూపించబోతున్నారు అని..ఈ సప్త చిరంజీవులుగా దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రాజమౌళి, రానా, అమితాబ్ బచ్చన్, నాని, కమల్ హాసన్ కనిపించబోతున్నారంటూ గత కొన్ని రోజులుగా నెట్టింట కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. 


ఇప్పుడు మరో వార్త ఏమిటంటే, ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ కూడా ఒక ప్రత్యేక పాత్రతో కనిపించబోతున్నారట. కాగా ఈమె ఈ సినిమాలో కృష్ణుడు ప్రేయసి రాధ పాత్రలో కనిపించనుంది అని అయితే ఈ పాత్ర నిడివి చాలా తక్కువ ఉంటుందని తెలుస్తోంది. కాగా ఈ వార్తల పైన అంతా అఫీషియల్ కన్ఫర్మేషన్ కావాలి అంటే మరి కొద్ది రోజులు వేచి చూడాలి.


Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్‌.. ఈ కథ స్ఫూర్తిదాయకం


Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క



 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook