Naga Chaitanya Custody అక్కినేని నాగ చైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన కస్టడీ సినిమా వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మే 12వ తారీకున తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాట కూడా భారీ ఎత్తున విడుదల కాబోతున్న కస్టడీ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తమిళ విలక్షణ దర్శకుడిగా పేరు దక్కించుకున్న వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో నాగ చైతన్య పాత్ర విభిన్నంగా ఉంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు చాలా బలంగా చెబుతున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటికే విడుదల అయిన టీజర్ పోస్టర్స్ సినిమా పై ఆసక్తిని పెంచడంలో సఫలం అయ్యాయి. అయితే గత కొన్నాళ్లుగా అక్కినేని అభిమానులకు వరుసగా నిరాశ తప్పడం లేదు. నాగార్జున.. నాగ చైతన్య.. అఖిల్‌ వరుసగా బాక్సాఫీస్ వద్ద తమ సినిమాలతో డిజాస్టర్స్ ను చవి చూశారు. మొన్నటికి మొన్న అఖిల్‌ ఏజెంట్‌ సినిమా ఏ స్థాయిలో డిజాస్టర్‌ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇలాంటి సమయంలో అక్కినేని ఫ్యాన్స్ కు నాగ చైతన్య కస్టడీ సినిమా తో ఒక రిలీఫ్‌ ను ఇస్తాడని... ఈ సినిమా తో వరుస ఫ్లాప్‌ ల జోరుకు బ్రేక్ ను చైతూ వేసే అవకాశం ఉంది అంటూ యూనిట్‌ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


 తాజాగా కస్టడీ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సమావేశంలో నాగ చైతన్య ను వరుసగా వస్తున్న ఫ్లాప్స్ తో అక్కినేని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు కదా.. దీనిపై మీ స్పందన ఏంటి అంటూ చైతూను ప్రశ్నించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇండస్ట్రీలో సక్సెస్‌ ఫెయిల్యూర్స్‌ అనేవి కామన్‌ విషయం. అభిమానులు మాకు ఎంత ప్రేమను అందిస్తూ ఉన్నారు. వారికి మేము ఒక మంచి సక్సెస్ ఫుల్‌ చిత్రాన్ని అందించాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం. లైఫ్‌ లో చాలా సార్లు కొన్ని అనుకున్నట్లుగా జరగవు. కనుక సక్సెస్ కోసం వెయిట్‌ చేయాల్సిందే అన్నట్లుగా పేర్కొన్నాడు. 


కస్టడీ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకాన్ని చైతూ వ్యక్తం చేశాడు. అక్కినేని ఫ్యాన్స్ తో పాటు అందరికి కూడా ఈ సినిమా కనెక్ట్‌ అవుతుందని యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. సాధారణంగా ప్రతి సినిమాలో కూడా హీరో వెనుక విలన్‌.. విలన్‌ వెనుక హీరో కక్ష సాధించడం కోసం పడుతూ ఉంటారు.


Also Read:  samyuktha hegde : బికినీలో తాటిచెట్టెక్కిన సంయుక్త..పిచ్చెక్కించిన 'కిరాక్' బ్యూటీ


కానీ ఈ సినిమాలో మాత్రం ప్రతి సన్నివేశంలో కూడా విలన్‌ ను కాపాడేందుకు హీరో ప్రయత్నిస్తూ ఉంటాడు. విలన్‌ ను కాపాడటమే సినిమా యొక్క మెయిన్‌ లైన్ గా దర్శకుడు వెంకట్ ప్రభు ఈ సినిమాను రూపొందించినట్లుగా తెలుస్తోంది. చైతూ తో పాటు కృతి శెట్టి విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా తో నాగ చైతన్య తమిళంలో మంచి మార్కెట్‌ ను క్రియేట్‌ చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.


Also Read:  Prabhas Hospitality : నిజంగానే రాజువయ్యా!.. ప్రభాస్ గొప్పదనం చెప్పిన రంగస్థలం మహేష్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook