Naga Chaitanya : పోతుందని తెలిసి కూడా ప్రమోషన్స్ చేయడం కష్టం!.. థాంక్యూపై నాగ చైతన్య
Naga Chaitanya Director Parasuram నాగ చైతన్య తాజాగా దర్శకుడు పరుశురాం మీద చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. దర్శకుడు పరుశురాం తన టైం వేస్ట్ చేశాడని, అతని గురించి మాట్లాడి కూడా వేస్ట్ అంటూ దారుణంగా కామెంట్లు చేశాడు.
Naga Chaitanya Custody Promotions నాగ చైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమాను ప్రమోట్ చేసేందుకు తెలుగు మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమాను భారీ ఎత్తున ఈ శుక్రవారం విడుదల చేయబోతోన్నారు. ఈ ఇంటర్వ్యూల్లో నాగ చైతన్య చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. సమంత మీద, శోభితతో వస్తోన్న రూమర్ల మీద పరోక్షంగా స్పందించాడు. అయితే ఇప్పుడు నాగ చైతన్య పరుశురాం మీద, థాంక్యూ సినిమా మీద చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.
సినిమా ప్రమోషన్స్ మీద నాగ చైతన్య స్పందించాడు. సినిమా కోసం కాలేజ్‌లు తిరిగి, ఈవెంట్లు పెట్టి ప్రమోషన్స్ చేయడం వల్ల లాభం లేదు.. టీజర్, ట్రైలర్ బాగుండాలి.. సినిమాలో కంటెంట్ ఉండాలన్నట్టుగా నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. ఇక థాంక్యూ సినిమా గురించి నాగ చైతన్య చాలా విషయాలు చెప్పుకొచ్చాడు. సినిమా కథ అందరికీ నచ్చే తీసుకున్నామని, విక్రమ్, తాను, దిల్ రాజు కలిసే కథను ఓకే చేశామని అన్నాడు.
అయితే కథ విన్నప్పుడు బాగానే అనిపించిందని, మేకింగ్‌లో కాస్త తేడా కొట్టిందని, ఎడిటింగ్ టేబుల్ వద్దే సినిమా పోతుందని తనకు అర్థమైందట. ఎడిటింగ్ టేబుల్ వద్దే తనకు డౌట్స్ వచ్చాయట. అయితే సినిమా పోతుందని తెలిసి కూడా ప్రమోషన్స్ చేయడం కష్టమని అన్నాడు. సినిమా చూశాం.. అర్థమైంది.. కానీ బయటకు అలా చెప్పలేం.. కోట్లు పెట్టి తీసిన సినిమాను అలా బాగా లేదని మేం చేతులు దులుపుకోలేం కదా?.. చివరి వరకు అందరం కలిసి సినిమాను నడిపించాలని చూశామంటూ నాగ చైతన్య చెప్పుకొచ్చాడు.
Also Read: samyuktha hegde : బికినీలో తాటిచెట్టెక్కిన సంయుక్త..పిచ్చెక్కించిన 'కిరాక్' బ్యూటీ
ఇక నాగ చైతన్య ఓ డైరెక్టర్ గురించి ఇలా మాట్లాడటం చూసి అంతా షాక్ అవుతున్నారు. పరుశురాం గురించి మాట్లాడి వేస్ట్ అని, తన టైంను వృథా చేశాడని, ఆ టాపిక్ గురించి కూడా మాట్లాడటం నాకు ఇష్టం లేదని నాగ చైతన్య చెప్పుకొచ్చాడు. కస్టడీ సినిమాకు మొదటగా శివ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నాడట. కస్టడీ సినిమాలో చైతూ పాత్ర పేరు శివ. అందుకే శివ అనే టైటిల్ పెట్టాలని డైరెక్టర్ అనుకున్నాడట.
Also Read: Prabhas Hospitality : నిజంగానే రాజువయ్యా!.. ప్రభాస్ గొప్పదనం చెప్పిన రంగస్థలం మహేష్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook