Naga Chaitanya and Akhil to grace The Ghost Pre release event in Kurnool: సాధారణంగా కొడుకులు హీరోలు అయితే తండ్రులు సినిమాలను ప్రమోట్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు కాస్త ఆసక్తికరంగా తండ్రి సినిమాను ఇద్దరు హీరోలు ప్రమోట్ చేయబోతున్నారు. వారెవరో కాదు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్. అక్కినేని నాగార్జున హీరోగా ది ఘోస్ట్ అనే సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాను ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమాలో నాగార్జున ఒక ఇంటర్పోల్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ప్రకారం ఈ సినిమా పూర్తిస్థాయి సిస్టర్ సెంటిమెంట్తో యాక్షన్ థ్రిల్లర్ గా గూస్ బమ్స్ తెప్పించే యాక్షన్ సీన్స్ తో రూపొందించారు. దసరా బరిలో అక్టోబర్ 5వ తేదీన దిగబోతున్న ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలను మరింత పెంచేందుకు సినిమా యూనిట్ రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.


ఇప్పటికే కర్నూలులో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసి అధికారికంగా ప్రకటించిన ఈ సినిమా యూనిట్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదేమిటంటే ఈవెంట్ కి నాగార్జున ఇద్దరు కొడుకులు అక్కినేని నాగచైతన్య, అక్కినేని అఖిల్ ముఖ్యఅతిథిగా అతిథులుగా హాజరు కాబోతున్నారు. అక్కినేని ఫ్యామిలీ అంతా ఒకే స్టేజి మీదకు రాబోతూ ఉండడంతో అక్కినేని అభిమానులైతే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


ఇక ఈవెంట్ కి ముగ్గురు హీరోలు వస్తూ ఉండడంతో భారీగా జన సమీకరణ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఇప్పటికే పోలీసులకు కూడా సినిమా యూనిట్ సమాచారం అందించినట్లు తెలుస్తోంది. తాజాగా జింఖానా గ్రౌండ్స్ లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఏపీ పోలీసులు ఈ ఈవెంట్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోబోతున్నారని తెలుస్తోంది. గాడ్ ఫాదర్ సినిమా కూడా అక్టోబర్ 5వ తేదీన విడుదలవుతోంది.


అయితే ఆ సినిమాకు కొంత నెగిటివ్ టాక్ వస్తే అది ది ఘోస్ట్ సినిమాకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు. సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున సినిమాలు ఇలా సినిమాల విషయంలో పోటీ పడలేదు. గత రెండు దశాబ్దాలలో ఇలా నేరుగా ఇద్దరి సినిమాలు ఎప్పుడు విడుదల అవలేదు. ఇద్దరికీ తమ తమ సినిమాల మీద ఉన్న నమ్మకంతో అక్టోబర్ 5వ తేదీన విడుదల చేయడానికి మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Also Read: God Father Re Shoot: సెన్సార్ అయ్యాక గాడ్ ఫాదర్ రీ షూట్.. ఇదేదో తేడాగా ఉందే!


Also Read: Allu Sirish Movie Release: ఎట్టకేలకు అల్లు శిరీష్ సినిమాకు మోక్షం.. రిలీజ్ ఎప్పుడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook