Naga Chaitanya and Sobitha: శోభిత ధూళిపాల.. నాగచైతన్యతో ఎంగేజ్మెంట్.. తర్వాత సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇక ఈమెకు సంబంధించిన వివరాలు.. తెలుసుకోవడానికి నెటిజెన్లు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. ఈమె ఎక్కడ పుట్టింది? ఎలా యాక్టర్ అయింది అనే విషయాలతో.. పాటు ఆమెకు సంబంధించిన పర్సనల్ వివరాలు తెలుసుకోవడానికి.. ఇంటర్నెట్లో తెగ వెతికెస్తున్నారు. ఈ నేపథ్యంలో..ఈ నటి చూడడానికి చాలా మోడరన్ గా ఉన్న.. పూజల విషయంలో చాలా పద్ధతిగా ఉంటుంది అని ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శోభిత ఉదయాన్నే సుప్రభాతం.. చదువుతుంది అన్న విషయం మీకు తెలుసా? అంతేకాదు ఆమె పొద్దున  ప్రత్యేకంగా పూజలు.. కూడా చేస్తుందట. సుప్రభాతం తో పాటు సూర్యాష్టకం చదవండే.. ఆమె రోజు ప్రారంభం కాదు అన్న విషయం.. విన్న వారు ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తనకు తీరిక సమయాల్లో ఆలయాలకు వెళ్లడం ఒక హాబీ అంట. 


తెనాలిలో పుట్టి పెరిగి.. ఆ తర్వాత వైజాగ్ లో విద్యాభ్యాసం.. పూర్తి చేసిన శోభితకు సంబంధించిన ఎన్నో విషయాలు నాగచైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత వెలుగులోకి వచ్చాయి. శోభిత తండ్రి వేణుగోపాలరావు మర్చంట్ నావిలో.. పనిచేసేవారు. అందుకే ఆమెకు వైజాగ్ తో విడదీయలేని అనుబంధం ఉంది. తల్లి టీచర్ కావడంతో ఇంట్లో కూడా ఎంతో క్రమశిక్షణ అలవాటయింది. ఇక చిన్నతనం నుంచి సంప్రదాయాలను.. చక్కగా పాటిస్తూ పెరగడం వల్ల పొద్దున నిద్ర లేచిందే పూజలు చేయడం, సుప్రభాతం .. సూర్యాష్టకం వంటివి చదవడం ఆమెకు దినచర్యగా మారాయి. అంతేకాదు ఈ రోజుల్లో కూడా శోభిత.. కేవలం ఇంటి ఫుడ్ మాత్రమే తినడానికి ప్రాధాన్యత ఇస్తుందట. 


మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన శోభితకు.. చిన్నతనం నుంచి ఇంటి పనులు సొంతంగా చేసుకోవడం అలవాటట. అందుకే ఇప్పటికీ అదే అలవాటు కొనసాగిస్తుందట. ఇక శోభితకు.. భరతనాట్యం తో పాటు గిటార్ వాయించడం అంటే చాలా ఇష్టం. గతంలో సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న.. నాగచైతన్య కొన్నాళ్ల తర్వాత విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే.  తాజాగా శోభితతో.. జరిగిన నాగచైతన్య ఎంగేజ్మెంట్ అందరినీ షాక్‌కి గురిచేసింది. ఈ నేపథ్యంలో శోభితలో ఉన్న ఈ లక్షణాలు నచ్చాయి కాబట్టి.. నాగచైతన్య ఆమెకు దగ్గరయ్యాడు అంటూ కొందరు నెటిజన్లు ఈ విషయాలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.


Also Read: KTR Jail: అవినీతి కేసులో కేటీఆర్‌ జైలుకు ఖాయం: బండి సంజయ్ వ్యాఖ్యలతో కలకలం


Also Read: KTR Emotinal: జైలులో కవిత దుర్భరంగా ఉంది.. ఆమె ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్‌ ఆవేదన



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter