Naga Chaitanya Relationships: 2016లో నాగ చైతన్య హీరోగా.. నటించిన ప్రేమమ్ సినిమా గురించి తెలియని వారు ఉండరు. మలయాళంలో సూపర్ హిట్ అయిన. ప్రేమమ్ సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కింది. చందు మొండేటి దర్శకత్వం.. వహించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. అనుపమ పరమేశ్వరన్, శృతిహాసన్, మడోనా సెబాస్టియన్ లు ఈ సినిమాలో.. హీరోయిన్లుగా నటించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ పాత్ర పేరు సుమ. శృతిహాసన్ సితార.. అనే పాత్ర పోషించగా.. మడోనా సింధు అనే పాత్రలో కనిపించింది. ఆసక్తికరంగా మూడు పాత్రల పేర్లు ఎస్ (S) అనే అక్షరంతోనే మొదలయ్యాయి. అదే తాజాగా.. ఇప్పుడు నిజజీవితంలో కూడా నాగచైతన్య ప్రేమించిన వాళ్ళ పేర్లు అదే అక్షరంతో మొదలయ్యాయి అంటూ సోషల్ మీడియాలో మీమ్ వైరల్ అవుతోంది.


సమంత కంటే ముందు.. నాగచైతన్య హీరోయిన్ శృతిహాసన్ తో ప్రేమలో ఉన్నారు అనిఆపట్లో వార్తలు గట్టిగా విన్పించాయి. వాళ్ళిద్దరూ ఈ విషయాన్ని అధికారికంగా బయటకు చెప్పకపోయినప్పటికీ.. వీళ్ళిద్దరి ప్రేమాయణం అప్పట్లో హాట్ టాపిక్ అయింది. కానీ కొద్ది రోజులకే.. ఆ జంట విడిపోయింది. ఆ తర్వాత నాగచైతన్య సమంతని.. ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతికి తెలిసిందే.


ఇక పెళ్లయ్యి నాలుగేళ్లు.. కూడా పూర్తికాకముందే ఈ జంట కూడా విడాకులు ప్రకటించింది. విడాకుల తర్వాత చాలా తక్కువ సమయంలోనే నాగచైతన్య మరొకసారి ప్రేమలో పడ్డారు. ఈసారి.. నటి శోభిత ధూళిపాలతో డేటింగ్ చేసిన నాగచైతన్య.. తాజాగా ఆగస్టు 8వ తేదీన ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నారు. 


ఈ నేపథ్యంలో నాగచైతన్య నిజజీవితంలో.. కూడా ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే పేర్లు ఉన్న వాళ్ళతోనే.. ప్రేమలో పడుతున్నారు.. అంటూ ఒక మీమ్ వైరల్ గా మారింది. శృతిహాసన్, సమంత, శోభిత ముగ్గురి పేర్లు ఎస్ తోనే.. మొదలవడం యాదృశ్చికం. 


గతంలో నాగచైతన్య, సాయి పల్లవి.. మధ్య కూడా ఏదో ఉంది అంటూ కామెంట్లు వినిపించాయి. ఆమె పేరు కూడా ఎస్ తో మొదలవడం పెద్ద కోఇన్సిడెన్స్ అంటూ.. కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇక సినిమాలపరంగా చూస్తే నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన తండేల్ సినిమా.. త్వరలో విడుదలకి సిద్ధం అవుతోంది.


Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..


Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter