Naga Chaitanya Interesting Comments: సరైన సక్సెస్ కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన సినిమా విడుదల కానున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను వైజాగ్ లో ఘనంగా నిర్వహించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక ఈ ఈవెంట్లో పాల్గొన్న నాగచైతన్య మాట్లాడుతూ..వైజాగ్ తో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నేను వైజాగ్ అల్లుడిని.వైజాగ్ కి చెందిన అమ్మాయిని ప్రేమించి మరి పెళ్లి చేసుకున్నాను. ప్రస్తుతం వైజాగ్ దే ఇంట్లో రూలింగ్ పార్టీ. మొత్తం వారి చేతుల్లోనే ఉంది అంటూ ఇండైరెక్టుగా తన ఇంట్లో శోభిత దూళిపాళదే పెత్తనం అన్నట్లుగా సరదాగా చెప్పుకొచ్చారు నాగచైతన్య. 


అలాగే నాగచైతన్య మాట్లాడుతూ మేము ఏదైనా ఒక సినిమా విడుదల చేశామంటే ముందుగా వైజాగ్ లో టాక్ ఎలా ఉంది అని ప్రశ్నిస్తాము. ఇక్కడ  సినిమా విజయం సాధించిందంటే ప్రపంచంలో ఎక్కడైనా సరే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రస్తుతం మా ఇంట్లో వైజాగ్ దే రూలింగ్ కాబట్టి ఇక్కడ నా సినిమా కలెక్షన్స్ బాగా రావాలి. లేకపోతే ఇంట్లో నా పరువు పోతుంది అంటూ చెప్పుకొచ్చారు. 


మొత్తానికి అయితే పెళ్లిని అడ్డం పెట్టుకొని ప్రమోషన్స్ ని బాగా చేసుకుంటున్నారు నాగచైతన్య అంటూ నెటిజెన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.అంతేకాదు కొంతమంది మీమర్స్ ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. నాకు వైజాగ్ అంటే చాలా ఇష్టం అని చెప్పొచ్చు లేదా వేరే ఎగ్జాంపుల్ చెప్పొచ్చు కానీ ఇలా నీ పెళ్లి ప్రేమ గురించి చెప్పడం ఏంటి అంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు.


 



మొత్తానికైతే నాగచైతన్య తన సినిమా ప్రమోషన్స్ కోసం శోభిత ధూళిపాలతో ప్రేమ, పెళ్లిని గట్టిగా వాడుకుంటున్నారని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి అల్లు అరవింద్ నిర్మాతగా మారగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది.


Also Read: చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..


Also Read: Prakash Raj Kumbha Mela: కుంభమేళాలో ప్రకాష్ రాజ్ పుణ్య స్నానాలు.. స్పందించిన నటుడు..  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.