Thank You TRP Rating : నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ కాంబోలో వచ్చిన మనం సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఇదే కాంబోలో థాంక్యూ చిత్రం రావడంతో మంచి అంచనాలు ఏర్పడాయి. టీజర్ విజువల్స్, ట్రైలర్‌లో డైలాగ్స్, నాగ చైతన్య ఎమోషనల్ నటన ఇలా అన్నీ కూడా సినిమా మీద అంచనాలు పెంచేసింది. అయితే తీరా సినిమాను చూస్తే నాసిరకం కథ, కథనాలతో విసిగెత్తించేశారు. దీంతో సినిమా దారుణంగా బెడిసి కొట్టేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా బాక్సాఫీస్ వద్ద తేడా కొట్టేసింది. ఓటీటీలో జనాలు తిరస్కరించేశారు.ఇక బుల్లితెరపైనా నాగ చైతన్య ఓటీటీకి పరాభవమే మిగిలింది. ఈ సినిమాను గత వారం జెమినీలో ప్రసారం చేస్తే.. దారుణమైన రేటింగ్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి  3.41 రేటింగ్ మాత్రమే వచ్చింది. అదే నిఖిల్ నటించిన కార్తికేయకు అయితే 7.88 రేటింగ్ వచ్చింది. అసలే ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు కొల్లగొట్టేసి ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.


ఇదే టైంలో సీతారామం సినిమాను కూడా ప్రసారం చేశారు. అయితే ఈ చిత్రానికి బుల్లితెరపై మంచి స్పందన వచ్చింది. 8.73 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అంటే ఈ మూడింట్లో కెల్లా సీతారామం సినిమాకు ఎక్కువగా రేటింగ్ వచ్చిందన్న మాట. ఇక సర్కారు వారి పాట రెండో సారి ప్రసారం చేయగా.. 6.8 రేటింగ్ సాధించింది.


ఒకప్పుడు టీఆర్పీ రేటింగ్ అంటే ఇరవై పాయింట్లకు పైనే ఉండేది. అలా ఇప్పుడు పుష్ప టాప్ ప్లేస్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. కానీ జనాలు ఇప్పుడు టీవీల్లో సినిమాను చూసేందుకు అంతగా ఇష్టపడటం లేనట్టుగా కనిపిస్తోంది. అందుకే టీఆర్పీ రేటింగ్స్ పదిలోపే ఉంటున్నాయి. ఇదిలానే కొనసాగితే.. సినిమా డిజిటల్ రైట్స్‌లో గట్టి దెబ్బే పడేట్టు కనిపిస్తోంది.


మొత్తానికి నాగ చైతన్య మాత్రం తన కొత్త సినిమాను రెడీ చేస్తున్నాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతో కలిసి కస్టడీ అనే సినిమాను చేస్తున్నాడు. రీసెంట్‌గా జరిగిన చైతూ బర్త్ డే స్పెషల్‌గా రిలీజ్ చేసిన కస్టడీ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.


Also Read : Mahesh Babu Son Gautam : అమ్మ బాబోయ్ గౌతమ్‌లో ఈ టాలెంట్ ఉందా?.. స్కూల్‌లో స్టేజ్ మీద మహేష్ బాబు తనయుడి నటన


Also Read : Pawan Kalyan Gundu : పవన్ కళ్యాణ్‌కు నిజంగానే గుండు కొట్టించారా?.. అసలు విషయం చెప్పిన పరిటాల శ్రీరామ్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook