Samantha vs Naga Chaitanya: పాపం సమంత..నాగచైతన్య కలెక్షన్స్ టచ్ చేయలేకపోయిందిగా ?
Thank You Collections vs Shaakuntalam Collection Report: సమంత ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం శాకుంతలం, నాగచైతన్య థాంక్ యూమొదటి రోజు కలెక్షన్స్ మధ్య కంపారిజన్ మొదలైంది.
Thank You Collections vs Shaakuntalam Collections: సమంత ప్రధాన పాత్రలో రూపొందిన తాజా చిత్రం శాకుంతలం. గుణశేఖర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని గుణశేఖర్ స్వయంగా నిర్మించగా దిల్ రాజు రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేశారు. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సైతం రిలీజ్ అయింది. సమంత సినిమా కావడం దానికి తోడు గుణశేఖర్ చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
దానికి తగ్గట్టే ఈ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ ప్రధాన పాత్రలో కనిపిస్తున్నట్లుగా ప్రచారం చేయడంతో ఈ సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. అయితే మొదటి ఆట నుంచే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపద్యంలో మొదటి రోజు కలెక్షన్స్ మీద కూడా ఆ ప్రభావం పడింది. ఇక ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? అనే విషయాన్ని పరిశీలిస్తే నైజాం ప్రాంతంలో 52 లక్షలు, సీడెడ్ 10 లక్షలు, ఉత్తరాంధ్ర 15 లక్షలు, ఈస్ట్ గోదావరి ఎనిమిది లక్షలు, వెస్ట్ గోదావరి నాలుగు లక్షలు, గుంటూరు ఎనిమిది లక్షలు, కృష్ణ ఎనిమిది లక్షలు, నెల్లూరు 3 లక్షలు మొత్తం కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలో కోటి ఎనిమిది లక్షల షేర్ రెండు కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది.
ఇదీ చదవండి: Samantha Divorce: నాగచైతన్య మంచి కోరే సమంత విడాకులు ఇచ్చిందా.. వెలుగులోకి షాకింగ్ అంశం!
తమిళంలో 22 లక్షలు, కర్ణాటక సహా మిగతా భారతదేశంలో 20 లక్షలు, ఓవర్సీస్ లో 74 లక్షలు కలిపి మొత్తంగా రెండు కోట్ల 24 లక్షల షేర్ నాలుగు కోట్ల 70 లక్షల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ సినిమా ఓవరాల్ బిజినెస్ 18 కోట్లకు జరగడంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్గా 19 కోట్లు నిర్ణయించారు. ఇంకా 16 కోట్ల 76 లక్షలు వసూలు చేస్తే ఈ సినిమా హిట్ అవుతుంది.
ఈ నేపద్యంలో సమంత సత్తాకి ర్ కలెక్షన్స్ ఏమాత్రం చాలావని సినిమా మీద నెగిటివ్ టాక్స్ స్ప్రెడ్ అవ్వడంతో సినిమా కలెక్షన్స్ తగ్గిపోయాయి అని అంటున్నారు. ఈ నేపద్యంలో కొంతమంది నాగచైతన్య థాంక్యూ సినిమా కలెక్షన్స్ తో పోలుస్తున్నారు. థాంక్యూ సినిమాని విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేయగా గత ఏడాది జూలై నెలలో రిలీజ్ అయింది. అప్పట్లోనే ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో కోటి 65 లక్షలు వసూలు చేయగా ప్రపంచవ్యాప్తంగా రెండు కోట్ల 16 లక్షల షేర్ వసూలు చేసింది.
రెండు తెలుగు రాష్ట్రాలలో నాగచైతన్య థాంక్ యూ కలెక్షన్స్ కూడా సమంత శాకుంతలం టచ్ చేయలేకపోయిందని అంటున్నారు. నిజానికి నాగచైతన్య సినిమాలో నాగచైతన్య తప్ప స్టార్ అట్రాక్షన్ మరి ఏమీ లేదు. కానీ సమంత సినిమా విషయానికి వస్తే ఒకపక్క సమంత గుణశేఖర్ కాంబినేషన్ మాత్రమే కాదు అల్లు అర్హ స్టార్ అట్రాక్షన్ కూడా యాడ్ అయింది. అయినా సరే నాగచైతన్య సినిమా దాదాపుగా ఇంతే కలెక్షన్స్ తెచ్చుకోవడం, రెండు తెలుగు రాష్ట్రాల్లో ముందు ఉండడంతో మావాడు తోపు అంటూ కామెంట్లు చేస్తున్నారు నాగచైతన్య ఫ్యాన్స్.
ఇదీ చదవండి: Shaakuntalam vs Rudrudu: సమంతకి షాక్.. ఆ ఏరియాలలో లారెన్స్ మైండ్ చెదిరే డామినేషన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook