Avika Gor Popcorn : మది విహంగమయ్యే.. చిన్నారి పెళ్లికూతురి కోసం నాగ చైతన్య
Naga Chaitanya For Avika Gor అక్కినేని నాగ చైతన్య సాధారణంగా బయటకు రాడు. తన సినిమా ప్రమోషన్స్ తప్పా మిగతా ఎక్కడా కూడా కనిపించడు.కానీ ఇప్పుడు చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ సినిమా ప్రమోషన్స్ కోసం బయటకు వచ్చాడు.
Naga Chaitanya For Avika Gor చిన్నారి పెళ్లికూతురు సీరియల్‌తో అవికా గోర్ ఫేమస్ అయింది. ఆ తరువాత టాలీవుడ్‌లో ఉయ్యాల జంపాలతో అందరినీ మెప్పించింది. ఇప్పుడు కుర్ర హీరో సాయి రోనక్‌తో కలిసి పాప్ కార్న్ అనే సినిమాతో రాబోతోంది. ఈ సినిమాను ఎం.ఎస్.చలపతి రాజు సమర్పణలో ఆచార్య క్రియేషన్స్, అవికా స్క్రీన్ క్రియేషన్స్ బ్యానర్స్‌పై భోగేంద్ర గుప్తా (నెపోలియన్, మా ఊరి పొలిమేర చిత్రాల నిర్మాత) ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
హీరోయిన్ అవికా గోర్ ఈ చిత్రానికి సహ నిర్మాతగానూ వ్యవహరిస్తుండటం విశేషం. మురళి గంధం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 10న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కూడా జోరు మీదున్నాయి. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా ‘మది విహంగమయ్యే...’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటను హీరో నాగ చైతన్య విడుదల చేస్తూ.. సినిమా పెద్ద సక్సెస్ కావాలని యూనిట్‌కి అభినందనలు తెలిపాడు.
ఓ షాపింగ్ మాల్‌లోనే ఈ పాట సాగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఆ పాటలోని లిరిక్స్‌ను శ్రీజో అందంగా రచించగా. . శ్రవణ్ భరద్వాజ్ బాణీ.. బెన్నీ దయాల్, రమ్యా బెహ్రా చక్కగా ఆలపించారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు ఎం.ఎస్.చలపతి రాజు మాట్లాడుతూ..‘పాప్ కార్న్’ మూవీని ఫిబ్రవరి 10న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నామని, ఇప్పటి వరకు రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ అని చెప్పుకొచ్చాడు.
సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించిన అవికా గోర్ మాట్లాడుతూ .. ఇదొక డిఫరెంట్ మూవీ అని, డైరెక్టర్ మురళి నెరేషన్ వినగానే ఓకే చెప్పేశానని చెప్పుకొచ్చింది. హీరో సాయి రోనక్ మాట్లాడుతూ.. సినిమా ప్రారంభమైన పది నిమిషాలకే ప్రేక్షకులు సినిమాలోకి లీనమైపోతారని అన్నాడు.
Also Read: Veera Simha Reddy Break even : మరీ ఇంత దారుణమా?.. చిరు మీద ఇంత కక్షా?.. బాలయ్య మీద అంత ప్రేమనా?
Also Read: Chiranjeevi : సెట్‌కు వెళ్లే ముందు ఇంట్లో వంట మనిషితో.. ఆసక్తికరమైన విషయాన్ని చెప్పిన చిరంజీవి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook