Naga Chaitanya Vs Sobhita: చైతూ, శోభితా ఫస్ట్ టైమ్ ఎక్కడ ఎపుడు కలుసుకున్నారో తెలుసా.. ! ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇవే..
Naga Chaitanya Vs Sobhita: నాగ చైతన్య, శోభితా ధూళిపాళ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు వీళ్లిద్దరు నిశ్చితార్థం చేసుకుంటున్నారు. ఇరు కుటుంబాలకు చెందిన కొద్ది మంది సభ్యుల సమక్షంలో వీళ్లు ఉంగరాలు మార్చుకుంటున్నారు. అయితే.. వీరిద్దరు తొలిసారి ఎపుడు, ఎలా కలుసుకున్నారనే విషయం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
Naga Chaitanya Vs Sobhita: నాగ చైతన్య, సమంతో విడాకుల తర్వాత ఎవరి సినిమాలతో వాళ్లు ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాదు ఎవరి జీవితాలను వాళ్లు లీడ్ చేస్తున్నారు. ఇక నాగ చైతన్య, సమంత విడిపోవడానికి ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్ ల తో పాటు ‘సూపర్ డీలక్స్’ సినిమాల్లో సమంత చేసిన ఇంటిమేట్ సీన్స్ తో నాగ చైతన్య హర్ట్ అయినట్టు సమాచారం. పెళ్లికి ముందు ఏం చేసినా.. పర్వాలేదు. కానీ పెళ్లి తర్వాత కూడా అక్కినేని ఇంటి కోడలనే విషయాన్ని గుర్తు పెట్టుకోకుండా ఇలాంటి సినిమాలు, వెబ్ సిరీస్ లు చేయడంపైనే చైతూ వాళ్ల నాన్న నాగార్జున కూడా హర్ట్ అయినట్టు సమాచారం. అందుకే సమంతకు నాగ చైతన్య విడాకులకు ఇదే ఓ కారణం అని చెబుతున్నారు.
మరోవైపు అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలో కథానాయికగా పరిచయం అయింది శోభితా ధూళిపాల. ఈ సినిమాలో సుప్రియ కూడా మరో ముఖ్యపాత్రలో నటించింది. ఆమె వల్ల నాగ చైతన్యకు శోభితా పరిచయమైంది. ఆమె పరిచయం తర్వాత వీళ్లిద్దరు కలిసిమెలిసి తిరగరారు. శోభితాతో చనువుగా ఉండటం మూలానా.. సమంత... నాగ చైతన్యను ప్రశ్నించినట్టు సమాచారం. అంతేకాదు వీళ్లిద్దరి విడాకులకు శోభితా కూడా ఓ కారణం అని మరో వెర్షన్ ప్రచారంలో ఉంది. ఈ రెండు విషయాల్లో ఏది నిజమో వాళ్లే చెప్పాలి.
ఏది ఏమైనా ‘గూఢచారి’ సినిమా షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరి మద్య చనువు ఏర్పడింది. దాదాపు ఆరేళ్లుగా వీళ్లిద్దరు డేటింగ్ లో కూడా ఉన్నట్టు సమాచారం. అంతేకాదు వీళ్లిద్దరు విదేశాలకు కూడా వెళ్లారు. అప్పట్లో కొన్ని పత్రికలు ఈ విషయమై చైతూతో పాటు శోభితను ప్రశ్నించినా.. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెబుతూ వచ్చారు. ఏది ఏమైనా.. సమంత తో విడాకుల తర్వాత నాగ చైతన్య.. ఇపుడు శోభితను పెళ్లి చేసుకుంటున్నాడు. అయితే.. ఒక హీరోయిన్ కు విడాకులు ఇచ్చిన తర్వాత చైతూ.. మరోసారి సినీ రంగానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడంపై అక్కినేని అభిమానులు ఆశ్యర్యం వ్యక్తం చేసారు. మరి పెళ్లి తర్వాత శోభితా.. అక్కినేని కోడలుగా ఇంటికే పరిమితమవుతుందా.. ? లేకపోతే తన సినిమాలు తాను చేసుకుంటూ వెళ్లిపోతుందా అనేది చూడాలి. స్వతహాగా మోడలింగ్ నుంచి వచ్చిన శోభితకు ఎక్స్ పోజింగ్ విషయంలో ఎలాంటి మొహమాటలు లేవు. ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో హద్దులు దాటేసి మరి రెచ్చిపోయి నటించింది. మరి పెళ్లి తర్వాత కూడా అదే ఊపు కంటిన్యూ చేస్తే నాగ చైతన్య అంగీకరిస్తాడా ? లేదా అనేది చూడాలి.
నాగ చైతన్య విషయానికొస్తే.. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో ‘తండేల్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇండో పాకిస్థాన్ నేపథ్యంలో 1970 నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఈ సినిమాలో నాగ చైతన్య సరసన సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమా పై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.
ఇదీ చదవండి: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
ఇదీ చదవండి: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter