Naga Shaurya wife Anusha Shetty Birthday నాగ శౌర్య గత ఏడాది పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గత నవంబర్‌ 20న బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త అనూష శెట్టిని నాగ శౌర్య పెళ్లి చేసుకున్నాడు. ఇక బెంగళూరులో జరిగిన ఈ పెళ్లికి టాలీవుడ్ నుంచి అతి కొద్ది మంది సెలెబ్రిటీలు మాత్రమే హాజరయ్యారు. ఇక పెళ్లికి కొన్ని రోజుల ముందే షూటింగ్‌ సెట్‌లో నాగ శౌర్య కళ్లు తిరిగి పడిపోయిన విషయం తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



దీంతో నాగ శౌర్య పెళ్లికి ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా? అని అంతా అనుకున్నారు. కానీ అది డైటింగ్ పాటించడం, షూటింగ్ కోసం బాడీ బిల్డింగ్ చేసే క్రమంలో జరిగిందే అని, పెద్ద ప్రమాదం ఏమీ లేదని తరువాత తెలిసింది. కొన్ని గంటలకే నాగ శౌర్యను హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ చేశారట. అలా పెళ్లికి ముందు కళ్లు తిరిగి పడిపోవడంతో అంతా అందోళన చెందారు. కానీ చివరకు పెళ్లి ఘనంగా జరిగింది.


పెళ్లాయక వచ్చే మొదటి బర్త్ డేను ఎంతో ప్రత్యేకంగా చూస్తుంటారు కొత్త జంటలు. అయితే ఇప్పుడు తన భార్యకు బర్త్ డే విషెస్ చెబుతూ తన ప్రేమను చూపించేశాడు నాగ శౌర్య. ఏది ఏమైనా, ఎలాంటి సమయంలోనైనా, ఎన్ని కష్టాలు వచ్చినా నీ వెంటే ఉంటాను.. నీతోనే ఉంటాను.. నువ్వే నా ప్రపంచం అంటూ ఇలా తన భార్యకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు నాగ శౌర్య.


నాగ శౌర్యకు గత కొన్నేళ్ల నుంచి హిట్ కోసం పరితపిస్తున్నాడు. కానీ నాగ శౌర్యకు హిట్ మాత్రం అందని ద్రాక్షలా మారింది. లక్ష్య, వరుడు కావలెను, కృష్ణావ్రిందా విహారి ఇలా ఏ సినిమా చేసినా కూడా అది ఫెయిల్ అవుతూనే వచ్చింది. ఇప్పుడు మాత్రం తనకు ఎంతో కలిసి వచ్చిన అవసరాల శ్రీనివాస్‌తో కలిసి ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి అంటూ వస్తున్నాడు. మరి ఈ సారైనా హిట్ కొడతాడా? అన్నది చూడాలి.


Also Read:  Basil Joseph Blessed with Baby Girl : తండ్రైన దర్శకుడు!.. ఆనందంలో తేలిపోతోన్న నటుడు


Also Read: Dhanush - Hyper Aadi : హైపర్ ఆది ఎందుకు ఫేమస్ అయ్యాడో తెలీదన్న ధనుష్.. స్టేజ్ మీదే కాళ్లు మొక్కేసిన కమెడియన్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook