Rangabali ott release: నెట్‌ఫ్లిక్స్‌లోకి నాగశౌర్య ‘`రంగబలి’`.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Rangabali ott: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య లేటెస్ట్ మూవీ `రంగబలి`. నెలరోజులు కూడా తిరగకుండానే ఈ సినిమా ఓటీటీ ఎంట్రీకి సిద్దమైంది. ఈ మూవీ ఎప్పటినుంచి స్ట్రీమింగ్ కానుందంటే..
Rangabali ott release date: నాగశౌర్య (Naga Shaurya) లీడ్ రోల్ లో నటించిన చిత్రం 'రంగబలి'(Rangabali). జులై 7న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్సడ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్ల మాత్రం అనుకున్నంత స్థాయిలో రాలేదు. ఫస్ట్ హాప్ అంతా కామెడీగానూ.. సెకండ్ ఆఫ్ అంతా సీరియస్ గానూ ఉండటంతో ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది. అయితే ఓ మోస్తరు కలెక్షన్లను రాబట్టింది. నాగశౌర్య, సత్య కామెడీ సినిమాకు హైలెట్. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ మూవీని కొనుగోలు చేసింది. తాజాగా స్ట్రీమింగ్ డేట్ ను కూడా ప్రకటించారు మేకర్స్. ఈ చిత్రాన్ని ఆగస్టు 4 నుంచి ఓటీటీలో అందుబాటులో ఉంచనున్నారు.
రంగబలి సినిమా జూలై 07న థియేటర్లలో విడుదలైంది. నెలరోజులు కూడా పూర్తికాకుండా ఈ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇస్తుంది. పవన్ బాసంశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నాగశౌర్య జోడిగా యుక్తి తరేజ నటించింది. ఈ సినిమాలో మలయాళ నటుడు షైమ్ టాన్ చాకో ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. ఈ చిత్రాన్ని ఎస్‌ఎల్‌వి సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ముఖ్యంగా ఈ సినిమా యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఛలో తర్వాత ఆ స్థాయి హిట్ అందుకోవడంలో నాగశౌర్య విఫలమవుతున్నాడు. రంగబలి అయిన బాగా ఆడుతుందనుకుంటే అది కూడా నిరాశను మిగిల్చింది. ఈ హీరో ఎన్ని జానర్‌లలో సినిమాలు ట్రై చేస్తున్న ఆ స్థాయి హిట్ మాత్రం అందుకోవడంలో సక్సెస్ కాలేకపోతున్నాడు.
Also Read: Bro Movie: 'బ్రో'మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్ ఫిక్స్.. ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook