Naga Shourya Dowry Details: టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఇన్నాళ్ల పాటు కొనసాగుతూ వచ్చిన నాగశౌర్య ఎట్టకేలకు తాను ప్రేమించిన అనూష శెట్టి మెడలో తాళి కట్టి వివాహ బంధంలోకి అడుగు పెట్టాడు. ఈ నేపథ్యంలో నాగశౌర్య అభిమానులైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. నిజానికి కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత టాలీవుడ్ లో జరుగుతున్న మొట్టమొదటి శుభకార్యం కావడంతో పెద్ద ఎత్తున టాలీవుడ్ ప్రముఖుల అందరినీ ఆహ్వానించి గ్రాండ్గా పెళ్లి చేసుకుంటాడని అందరూ భావించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కానీ బెంగళూరులో సైలెంట్ గా మమ అనిపించాడు నాగశౌర్య. ముందు నుంచి కూడా సినిమాలపరంగా కూడా ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ ఉండే నాగశౌర్య పెళ్లిని కూడా అంతే సైలెంట్ గా కానిచ్చేశాడు. సదరు అనూష శెట్టి బెంగళూరు బేస్ గా ఒక ఇంటీరియర్ డిజైనర్ కంపెనీ నడుపుతోంది. కొందరు కామన్ ఫ్రెండ్స్ ద్వారా వీరికి పరిచయం అవగా అది ముందు స్నేహానికి ఆ తర్వాత ప్రేమకు దారి తీసినట్లు తెలుస్తోంది. తర్వాత వివాహ బంధంతో ఒకటి అవ్వాలని నిర్ణయించుకుని ఇద్దరి ఇళ్లలో ఒప్పించి ఎట్టకేలకు ఒకటయ్యారు.


తెలుగు అబ్బాయి కన్నడ అమ్మాయి కాంబినేషన్ బాగుందని పలువురు కామెంట్స్ చేస్తుండగా వీరు కట్నం ప్రస్తావన కూడా తెర మీదకు వస్తోంది. నాగశౌర్య ఈ పెళ్లి చేసుకునేందుకు ఎంత కట్నం తీసుకున్నాడు అనే వివరాలు గురించి గూగుల్ లో చాలామంది వెతుకుతున్నారు. ఈ పెళ్లి చేసుకుంటున్న సమయంలో నాగశౌర్య కట్నం కూడా బాగా అందినట్లు తెలుస్తోంది. అనూష శెట్టి స్వగ్రామం మంగళూరు దగ్గరలోని కుందాపుర.


ఆమె తండ్రి అనూష చిన్నప్పుడే బెంగళూరు వచ్చి అక్కడే వ్యాపారాలు చేస్తూ సెటిలయ్యారు. కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదించిన ఆయన ప్రస్తుతానికి కూడా పలు వ్యాపారాలు చేస్తున్నారట. అనూష శెట్టి వ్యాపారం కూడా కోట్లలో టర్నోవర్ ఉంటుందని తెలుస్తోంది. ఇక నాగశౌర్యకు నగదు రూపంగా ఎలాంటి కట్నం ఇవ్వలేదు కానీ అనూష శెట్టి పేరు మీద ఉన్న కొన్ని ప్రాపర్టీ లను నాగశౌర్య పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.


ఆ ప్రాపర్టీల విలువ 50 నుంచి 80 కోట్ల దాకా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇదంతా ప్రచారమే కాగా అసలు నిజం ఏమిటన్నది నాగశౌర్య ఆయన భార్యకు మాత్రమే తెలియాలి. ఇక ప్రస్తుతానికి నాగశౌర్య చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. వాటితో ఎలా అయినా హిట్ అందుకోవాలని ఆయన గట్టి ప్రయత్నాలు చేస్తున్నాడు శౌర్య. 


Also Read: Dil Raju Comments: నీ ధైర్యం ఏంటి?.. స్టేజ్ మీదే నిర్మాతను ప్రశ్నించిన దిల్ రాజు 


Also Read: Singer Mangli: 28 ఏళ్ల వయసులో మంగ్లీకి అరుదైన గౌరవం.. దశ మార్చేసిన 'జగనన్న' సాంగ్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook