Nagababu Strong Counters to Minister RK Roja: ఇటీవల పలు ఇంటర్వ్యూలలో పాల్గొన్న మంత్రి రోజా మెగా ఫ్యామిలీని, మెగా బ్రదర్స్ ని ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ ముగ్గురు అన్నదమ్ములు ప్రజలకు చేసిందేమీ లేదని కాబట్టి వాళ్ళని ప్రజలు గెలిపించరు అంటూ ఆమె కామెంట్లు చేసిన నేపథ్యంలో ఆమెతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండి గతంలో జబర్దస్త్ షోలో సహ జడ్జిగా వ్యవహరించిన నాగబాబు ఇప్పుడు రోజా మీద విమర్శల వర్షం కురిపించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ముందు మంత్రిగా నీ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలని ఆయన రోజాకు కౌంటర్ వేశారు. రోజా భారతదేశపు రాష్ట్రాలన్నింటిలో పర్యాటక స్థానాల ర్యాంకింగ్లో కేరళ, అస్సాం, గుజరాత్ మొదటి మూడు స్థానాల్లో ఉంటే ఆంధ్రప్రదేశ్ 18వ స్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో చత్తీస్గడ్, జార్ఖండ్ ఉన్నాయి. ముందు ఈ విషయం మీద దృష్టి పెట్టమని నాగబాబు హితవుపలికారు.. మంత్రిగా నీ బాధ్యతలు మరిచిపోయి నోటికొచ్చినట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడితే అతి త్వరలో పదవి దిగిపోయేలోగా రాష్ట్రాన్ని ఆ 18వ స్థానం నుంచి 20వ స్థానానికి తీసుకు వెళ్లే ఛాన్స్ ఉందని నాగబాబు హెచ్చరించారు.


ఈ పర్యాటక శాఖ మీద ఆధారపడి వేలాది మంది ప్రత్యక్షంగా పరోక్షంగా జీవిస్తున్నారని వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారి జీవితాలు మట్టి కొట్టుకుపోయాయని ఆయన విమర్శించారు. నువ్వు పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వాళ్ళ పరిస్థితి ఇంకా దిగజారి పోతుందని ఆయన హెచ్చరించారు. ఇతరుల మీద విమర్శల వర్షం కురిపించడం మాని ముందు పర్యాటక శాఖ అంటే ఏంటి? పర్యాటక శాఖ మంత్రిగా నువ్వు నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏమిటి? తెలుసుకోవాలని ఆయన సూచనలు చేశారు. పర్యాటక శాఖ మంత్రి అంటే పర్యటనలు చేయడం కాదు పర్యాటక శాఖ ని ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకో అంటూ ఆయన ఘాటు కౌంటర్లు వేశారు.


రోజా ఎన్ని రోజులు చిరంజీవి పవన్ కళ్యాణ్ గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడినా నేను రియాక్ట్ అవ్వలేదంటే దానికి ఒకటే కారణం రోజా నోటికి మున్సిపాలిటీ కుప్ప తొట్టికి పెద్ద తేడా లేదు, అని నేను భావించడం వల్లే అని ఆయన పేర్కొన్నారు.. చూస్తూ చూస్తూ ఎవరూ మునిసిపాలిటీ కుప్ప తొట్టిని కెలకరు, ఇకనైనా బుద్ధి తెచ్చుకుని పర్యాటక శాఖ మీద దృష్టి పెట్టి ఎలా అభివృద్ధి చేయాలో తెలుసుకో అంటూ రోజాపై నాగబాబు ఫైర్ అయ్యారు. రోజా, నీది నోరా లేక మున్సిపాలిటీ కుప్ప తొట్టా? అనే పేరుతో నాగబాబు నిమిషం 45 సెకండ్ల నిడివి ఉన్న ఒక వీడియోని షేర్ చేసి ఆమెను టార్గెట్ చేశారు. మరి దీనికి మంత్రి రోజా నుంచి ఎలాంటి కౌంటర్లు వస్తాయనేది వేచి చూడాల్సి ఉంది.


Also Read: Balakrishna Targetted YS Jagan: జగన్ ను టార్గెట్ చేసిన బాలయ్య.. చరిత్ర అంటూ కౌంటర్లు!


Also Read: Ramya Raghupathi : దేవుడి లాంటి కృష్ణ గారితో అక్రమ సంబంధం అంతకట్టాడు.. అన్నతో అలా అంటూ రమ్య రఘుపతి సంచలనం!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook