Custody Movie Review in Telugu : థాంక్యూ సినిమాతో దారుణమైన డిజాస్టర్ అందుకున్న నాగచైతన్య కస్టడీ అనే సినిమాతో ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసాడు. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. శరత్ కుమార్, వెన్నెల కిషోర్, అరవింద్ స్వామి వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాలో ప్రియమణి ఒక ముఖ్యమైన పాత్రలో నటించింది. ఈ సినిమా ట్రైలర్, టీజర్ విడుదలైనప్పటి నుంచి సినిమా మీద ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కస్టడీ సినిమా కథ ఏమిటంటే?
సఖినేటిపల్లి పోలీస్ స్టేషన్లో శివ(నాగచైతన్య) కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూ ఉంటాడు. మంచికి, నిజాయితీకి మారుపేరైన శివ ఈ విషయంలో ఎవరి మాట వినకుండా తనకు నచ్చిన విధంగానే ముందుకు వెళుతూ ఉంటాడు. అదే ఊరిలో ఒక డ్రైవింగ్ స్కూల్లో టీచర్ గా పని చేస్తున్న రేవతి(కృతి శెట్టి)తో ప్రేమలో పడిన శివ తన ప్రేమను తగ్గించుకునేందుకు ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. అలా అనుకోకుండా రోడ్డు ప్రమాదానికి గురై సీబీఐ అధికారి(సంపత్ రాజ్), తన అదుపులో ఉన్న రాజు(అరవింద్ స్వామి) అనే నిందితుడిని కలుస్తాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలలో సీబీఐ అధికారి మరణించడంతో సదరు రాజు అనే నిందితుడిని సీబీఐ కోర్టు వరకు తీసుకెళ్లి వదిలి పెట్టాల్సిన బాధ్యత శివ మీద పడుతుంది. సీఎం మొదలు హోంగార్డు వరకు శివను, రాజుని అంతమొందించాలని ప్రయత్నిస్తున్న సమయంలో రేవతితో కలిసి శివ ఎలా ఆ రాజును తీసుకువెళ్లి సిబిఐ కోర్టు ముందు హాజరుపరిచాడు అనేది సినిమా కథ.


Also Read: Ustaad Bhagat Singh: ఈ సారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్దంటున్న ఉస్తాద్ భగత్ సింగ్


విశ్లేషణ:
సాధారణంగా వెంకట్ ప్రభు సినిమాలంటే అందరిలోనూ ఆసక్తి ఉంటుంది. ఆయన సినిమాలు అంటే టిపికల్ స్క్రీన్ ప్లేతో రేసీగా కథలో వచ్చే మలుపులు ఊహకు అందని విధంగా, మంచి థ్రిల్ కలగచేస్తూ మెస్మరైజ్ చేస్తాయి. కానీ 'కస్టడీ'లో ఆ స్క్రీన్ ప్లే  మ్యాజిక్ మిస్ అయ్యింది. 'కస్టడీ' ఒక జనరల్ రివేంజ్ డ్రామా! మాములుగా విలన్ ను కొట్టి, లేదా చావు అంచుల వరకు తీసుకువెళ్లి మార్చే హీరో ఈ సినిమాలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చావకూడదని చివరి వరకు హీరో ప్రయత్నించడమే కొత్త కాన్సెప్ట్. ప్రేక్షకుడి ఊహకు తగ్గట్టు నెమ్మదిగా సినిమా ముందుకు వెళ్లడంతో పాటు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ రొటీన్ కావడంతో సినిమాలో కావాల్సిన మ్యాజిక్ అయితే జరగలేదు. కొన్ని సీన్లలో వెంకట్ ప్రభు తన మార్క్ చూపించారు. లాజిక్స్ పక్కన పెడితే సినిమా చూసేయొచ్చు. బాంబ్ బ్లాస్ట్ తో ప్రారంభమైన ఈ సినిమా ఆ తర్వాత అనుకోని మలుపులు తిరుగుతూ వెళుతుంది. వెంకట ప్రభు సినిమా కావడంతో ఎవరు ఊహించని ట్విస్టులు ఊహించని కొత్త కొత్త పాత్రల ఎంట్రీ సినిమా మీద ప్రేక్షకులలో కొత్త ఇంట్రెస్ట్ కలిగించే ప్రయత్నం చేశారు.. నిజానికి కథ వరకు బాగానే ఉన్నా దాన్ని కదనంతో మ్యాజిక్ చేస్తూ ప్రేక్షకులను అలరించే దిశగా ప్రయత్నాలు ఫలించలేదు. మొదటి భాగం అంతా నాగచైతన్య పాత్ర సినిమాలో కీలకమైన పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నారు. ఇంటర్వెల్ ముందు కాస్త సినిమా మీద ఆసక్తి రేకెత్తించినా సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత సినిమా మళ్లీ నెమ్మదించిన ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్ కూడా నిరాశ పరుస్తుంది. 


నటీనటుల విషయానికి వస్తే
ఈ సినిమాలో నాగచైతన్య తన శివ అనే కానిస్టేబుల్ పాత్రలో జీవించేశాడు. కృతి శెట్టి పాత్ర కూడా సినిమా ఆద్యంతం ఉండేలా రాసుకోవడంతో ఆమెకు కూడా నటించేసుకోకుండా పాత్ర దొరికినట్లు అయింది. వెన్నెల కిషోర్ కామెడీ కొంతవరకు బాగానే ఉన్నా ఆయనను పూర్తిస్థాయిలో వాడుకోలేదేమో అనిపిస్తుంది. శరత్ కుమార్, జీవా, రామ్కి, ప్రేమ్ జీ వంటలక్క ఇలా చాలామంది ఉన్నా పూర్తి స్థాయిలో ఎవరి పాత్రకు న్యాయం జరగలేదేమో అనిపిస్తుంది. అయితే వారు మాత్రం తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. 


టెక్నికల్ టీం
ఇక టెక్నికల్ టీం విషయానికి వస్తే వెంకట్ ప్రభు రాసుకున్న ఈ కథ ఆసక్తికరమైనదే అయినా తెరకెక్కించే విషయంలో పెద్దగా వర్కౌట్ కాలేదు. తెలుగులో అబ్బూరి రవి డైలాగ్స్ బాగా వర్కౌట్ అయ్యాయి కామెడీ పంచులు కొంతవరకు ప్రేక్షకులను నవ్విస్తాయి. అయితే ఇళయరాజా ఆయన కుమారుడు అందించిన సంగీతం కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ పెద్దగా ఆకట్టుకోలేదు, అయితే కొన్ని ఫైటింగ్ సీన్లు చేజింగ్ సీన్లు మాత్రం ఆసక్తికరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేశారు కొంతవరకు అందులో సక్సెస్ అయ్యారు. ఎడిటింగ్ టేబుల్ మీద శ్రద్ధ తీసుకుని ఉంటే సినిమా అవుట్ ఫుట్ మరేలా ఉండదేమో. 


ఓవరాల్ గా చెప్పాలంటే 
నాగచైతన్యకు ‘కస్టడీ’ పూర్తిగా లభించలేదు.
Rating: 2.25/5


Also Read: Actor Naresh on Marriage : 'పవిత్ర'తో పెళ్లి అయిపోయిందా.. నరేష్ అసలు విషయం చెప్పేశాడుగా!