Nagachaitanya Movie: పరశురామ్ కి హ్యాండిచ్చిన నాగచైతన్య.. అసలు ఏమైందంటే?
Nagachaitanya -Parasuram Movie Shelved: సర్కారు వారి పాట సినిమాతో హిట్ కొట్టిన పరశురామ్ నాగచైతన్యతో ఒక సినిమా చేయడానికి అంతా సిద్దమైంది అనుకుంటున్న తరుణంలో క్యాన్సిల్ అయినట్టు తెలుస్తోంది. ఆ వివరాలు
Nagachaitanya -Parasuram Movie Called off: గతంలో సోలో, ఆంజనేయులు వంటి సినిమాలతో దర్శకుడుగా తన బ్రాండ్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు పరశురామ్. అయితే విజయ్ దేవరకొండ తో చేసిన గీత గోవిందం సినిమాతో పరుశురాం ఒక పెద్ద దర్శకుడిగా తన మార్క్ క్రియేట్ చేసుకోగలిగాడు. ఆ తర్వాత ఏకంగా చాలా సంవత్సరాలు ఎదురు చూసి మరీ మహేష్ బాబుతో సర్కారు వారి పాట అనే సినిమా చేసి హిట్టు అందుకున్నాడు ఆయన.
ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్యతో సినిమా చేసేందుకు చాలా కాలం ప్రయత్నాలు చేసిన పరశురామ్ ఆ సినిమాకు నాగేశ్వరరావు అనే వర్కింగ్ టైటిల్ కూడా పెట్టినట్లుగా మధ్య వార్తలు బయటకు వచ్చాయి. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ మీద ఈ సినిమా రూపొందించేందుకు సన్నాహాలు జరిగాయి. అయితే సర్కారు వారి పాట సినిమా విడుదల ఇప్పటికే 7 నెలలు పూర్తయింది, మహేష్ బాబు ఇప్పటికే త్రివిక్రమ్ తో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయడమే కాదు ఆ ప్రాజెక్టు పనుల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు.
కానీ పరశురాం నాగచైతన్య సినిమా అప్డేట్ ఏమిటి అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి. అయితే టాలీవుడ్ సినీ పరిశ్రమలో జరుగుతున్న తాజా ప్రచారం మేరకు ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని తెలుస్తోంది. అదేమిటంటే పరశురాం సిద్ధం చేసిన కథ నాగచైతన్యకు నచ్చలేదని అంటున్నారు. స్క్రిప్ట్ ఏ మాత్రం నచ్చకపోవడంతో నాగచైతన్య సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే ఇక ఈ నాగ చైతన్య పరశురాం ప్రాజెక్టు ఇక లేనట్లేనని అంటున్నారు.
ఇక మరో ఆసక్తికరమైన ప్రచారం ఏమిటంటే గీత గోవిందంతో విజయ్ దేవరకొండ కెరీర్ కి బాగా ప్లస్ అయిన పరశురాం ఇప్పుడు లైగర్ ప్లాప్ తో ఇబ్బందుల్లో ఉన్న విజయ్ తో మరో సినిమా చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విజయ్ దేవరకొండకు ఆయన ఒక కథ చెబితే దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయి అనేది మాత్రం కాలమే నిర్ణయించాలి మరి.
Also Read:Balakrishna Sorry: సారీ చెప్పడానికి రెడీగా లేని బాలయ్య.. విషెస్ చెప్పాడు కానీ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook