Nagarjuna World Rare Record: అక్కినేని నాగేశ్వరరావు తనయుడిగా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగార్జున.. తండ్రి బాటలో ఒక మూసకు పరిమితం కాకుండా.. డిఫరెంట్ క్యారెక్టర్ చిత్రాలతో తెలుగు సినీ చరిత్రలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు హీరోగా 38 యేళ్ల నట ప్రస్థానన్ని పూర్తి చేసుకున్నారు. ఈ యేడాది ‘నా సామి రంగ’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. త్వరలో ‘కుబేర’ మూవీతో పలకరించబోతున్నారు. ఆ సంగతి పక్కన  పెడితే.. ఇన్నేళ్ల కెరీర్ లో ప్రపంచ సినీ చరిత్రలో  నాగార్జునకు మాత్రమే సాధ్యమైన ఈ రికార్డు మరే హీరోకు సాధ్యం కాలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సినిమా ఇండస్ట్రీలో ఒక కథానాయిక.. తండ్రీ కుమారులు సరసన హీరోయిన్ యాక్ట్ చేయడం చాలా రేర్ అని చెప్పాలి. తెలుగు, హిందీ, తమిళ చిత్ర పరిశ్రమలో తండ్రికి జోడిగా నటించిన కథానాయికలు.. కుమారుల సరసన నటించారు. ఇక ఎన్టీఆర్ సరసన నటించిన జయసుధ, రతి అగ్నిహోత్రి, రాధలు ఆ తర్వాత బాలయ్యతో జోడి కట్టారు. అటు అక్కినేని నాగేశ్వరరావు సరసన కథానాయికలుగా నటించిన శ్రీదేవి, రాధ, రమ్యకృష్ణలు ఆయన కుమారుడైన నాగార్జునకు జోడిగా నటించారు.  


అటు తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో పాటు తన తనయుడు నాగ చైతన్య సరసన హీరోయిన్స్ గా నటించిన లావణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్ సింగ్ సరసన నటించారు. లావణ్య త్రిపాఠి నాగ చైతన్య సరసన ‘యుద్ధం శరణం’ సినిమాలో కథానాయికగా నటిస్తే.. నాగ్ సరసన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమాలో కథానాయికగా నటించింది. అటు చైతూ సరసన నటించిన రకుల్ ప్రీత్ సింగ్.. నాగ్ సరసన ‘మన్మథుడు 2’ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ రకంగా తండ్రీ ఏఎన్నాఆర్ సరసన నటించిన హీరోయిన్స్ తోనే కాదు.. తనయుడు  నాగ చైతన్య సరసన హీరోయిన్స్ తో యాక్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ హీరో ప్రపంచ సినీ చరిత్రలో ఇంకెవరు లేరు. మరి తెలుగు సహా వరల్డ్ వైడ్ గా ఏ హీరో కూడా ఇటు తండ్రి సరసన నటించిన కథానాయికలతో పాటు కుమారుడు సరసన నటించని హీరోయిన్స్ సరసన నటించిన ఏకైక హీరోగా రికార్డు నెలకొల్పాడు. భవిష్యత్తులో మరే హీరోకు ఈ రికార్డు బ్రేక్ చేయడం అంత ఈజీ కాదు.


ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..


ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి