Bangarraju: అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'బంగార్రాజు'(Bangarraju). కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. గతంలో వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, నాగచైతన్య, కృతిశెట్టి కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నాగలక్ష్మి పోస్టర్, బంగార్రాజు ఫస్ట్ లుక్ పోస్టర్‏కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read: ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదేనా ?


నేడు నాగచైతన్య పుట్టిన రోజు(Naga chaitanya Birthday). ఈ సందర్భంగా 'బంగార్రాజు' టీజర్(BangarrajuTeaser) విడుదల చేశారు నాగార్జున(Nagarjuna). తాజాగా విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇందులో బంగార్రాజు పాత్రలో నాగచైతన్య(naga chaitanya) కనిపిస్తుండగా.. నాగార్జున పాత్రను చైతన్య పోషిస్తున్నట్లుగా.. తెలుస్తోంది. సంక్రాంతి రేసులో నిలపడమే లక్ష్యంగా చిత్రాన్ని  శరవేగంగా ముస్తాబు చేస్తున్నారు. జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ స్వరాలందిస్తుండగా.. యువరాజ్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook