Nagarjuna Comments on Ponniyin Selvan 1 and Baahubali Comparison: తమిళ సినీ అభిమానులందరూ తమ బాహుబలి గా భావిస్తున్న పొన్నియన్ సెల్వన్ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా కనీసం బాహుబలి రికార్డులు అయినా బద్దలు కొడుతుందేమో అని వారంతా భావించారు. అయితే పొన్నియన్ సెల్వన్ సినిమా కథ అంతా తమిళులకు మాత్రమే కనెక్ట్ అయ్యే విధంగా ఉండటంతో ఇతర భాషల ప్రేక్షకులు దాన్ని పెద్దగా ఆదరించడం లేదు. ఈ విషయంలో తమిళ సినీ అభిమానులు కాస్త హర్ట్ అయినట్లు కూడా కనిపిస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కావాలనే తెలుగు వారు తమ పొన్నియన్ సెల్వన్ సినిమాను తొక్కేస్తున్నారని కావాలనే నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారని వారంతా భావిస్తున్నారు. నిజానికి పొన్నియన్ సెల్వన్ సినిమా పొన్నియన్ సెల్వన్ నవలను ఆధారంగా చేసుకుని రూపొందించారు. కాబట్టి అందులో ఉన్న పాత్రల పేర్లు కచ్చితంగా సినిమాలో వాడాల్సిందే. అయితే ఆ పేర్లు తమిళ వారికి కాస్త ఫెమిలియర్ గా ఉండవచ్చు కానీ ఆ పేర్లు తెలుగు వారికి చాలా వింతగా, గుర్తుపెట్టుకోవడానికి కూడా కష్టంగా ఉన్నాయి.


సినిమాలో ఒకటి రెండు పేర్లు తప్ప మిగతా అన్ని పేర్లు కష్టంగా ఉండటమే కాక స్క్రీన్ ప్లే కూడా కాస్త కన్ఫ్యూజింగ్ గా ఉండడం, నేరేషన్ బాగా స్లోగా అనిపించడంతో తెలుగు ప్రేక్షకులు ఎవరు ఈ సినిమాని మెచ్చడం లేదు. అయితే తాజాగా ది ఘోస్ట్ సినిమాని తమిళ్ లో విడుదల చేయడం కోసం తమిళ ట్రైలర్ లాంచ్ కోసం చెన్నై వెళ్లారు. ఈ సందర్భంగా పొన్నియన్ సెల్వన్ సినిమా వీక్షించారు. వీక్షించిన తర్వాత అక్కడి రిపోర్టర్లు సినిమా ఎలా ఉంది అని అడిగితే సినిమా అద్భుతంగా ఉందని నాగార్జున కామెంట్ చేశారు.




అయితే కొంతమంది బాహుబలితో కంపేర్ చేసి సినిమా బాలేదని అంటున్నారు కదా అంటే అసలు వారి మాటలు వినవద్దని నాగార్జున కామెంట్ చేయడమే గాక కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది అంటూ కామెంట్ చేశారు. అయితే నిజానికి సినిమా ఎలా ఉన్నా కచ్చితంగా నాగర్జున బాగుందని అంటారని ఎందుకంటే తన సినిమాని తమిళ ఆడియన్స్ ఆదరించాలి అంటే వారి సినిమాని కూడా బాగుందని మెచ్చుకుంటేనే తమ సినిమాని చూస్తారని ఆయన అలా కామెంట్ చేసి ఉండచ్చు అనే వాదన వినిపిస్తోంది.


కానీ నిజానికి నాగార్జున మణిరత్నంతో కలిసి ఒక సినిమా చేశారు. గీతాంజలి అనే సినిమా మణిరత్నం డైరెక్ట్ చేయగా నాగార్జున హీరోగా నటించారు. ఈ సినిమా నేషనల్ అవార్డు కూడా సాధించింది. దాదాపు ఈ సినిమాకు ఆరు నంది అవార్డులు కూడా లభించాయి. ఈ నేపథ్యంలోనే మణిరత్నంతో మీద ఉన్న కృతజ్ఞతతో సినిమా అద్భుతంగా ఉందని ఆయన కామెంట్ చేసి ఉండచ్చు అనే వాదన కూడా వినిపిస్తోంది.
Also Read: Om Raut to Prabhas Room: ఓం..నా రూమ్ కి రా... టీజర్ చూసి వయలెంట్ గా మారిన ప్రభాస్.. వీడియో వైరల్!


Also Read: Paid Bots Star Allu Arjun: పైడ్ బాట్స్ స్టార్ అల్లు అర్జున్ అంటూ ట్రోలింగ్.. ఆదిపురుష్ దెబ్బకేనా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి