Om Raut to Prabhas Room: ఓం..నా రూమ్ కి రా... టీజర్ చూసి వయలెంట్ గా మారిన ప్రభాస్.. వీడియో వైరల్!

Om Raut you coming to my room says Prabhas Video Goes Viral: ఆదిపురుష్ టీజర్ లాంచ్ తరువాత ప్రభాస్ కోపంగా ఓం రౌత్ నువ్వు నా రూమ్ కి రా అంటూ కోపంగా పిలిచినట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే 

Written by - Chaganti Bhargav | Last Updated : Oct 4, 2022, 10:16 AM IST
  • ఆదిపురుష్ టీజర్ రిలీజ్
  • దారుణంగా ఉందంటూ ట్రోల్స్
  • ప్రభాస్ కోపంగా ఉన్న వీడియో వైరల్
Om Raut to Prabhas Room: ఓం..నా రూమ్ కి రా... టీజర్ చూసి వయలెంట్ గా మారిన ప్రభాస్.. వీడియో వైరల్!

Om Raut you coming to my room says Prabhas Video Goes Viral: ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ గ్రాండ్ గా లాంచ్ చేసింది సినిమా యూనిట్. అక్టోబర్ రెండవ తేదీన అయోధ్యలోని సరయునది ఒడ్డున టీజర్ లాంచ్ చేశారు. అయితే ఈ టీజర్ లాంచ్ చేసిన తర్వాత నుంచి ప్రభాస్ సినిమా టీజర్ ఏమాత్రం బాలేదని ఫాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. టాలీవుడ్ ప్రేక్షకులైతే ఇదేంటి రా నాయనా అని తలలు పట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది.

ప్రభాస్ లాంటి హీరో సినిమా చేస్తున్నాడంటే దానిమీద ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఆ గ్రాఫిక్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కానీ అలాంటి జాగ్రత్తలు ఏమీ తీసుకోకుండా ఏదో ఇష్టం వచ్చినట్లు చిన్న పిల్లల కార్టూన్ సినిమాలకు గ్రాఫిక్స్ చేసే వాళ్ళతో ఆ గ్రాఫిక్స్ చేయించినట్లుగా ఉందని వారంతా అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పుడు టీజర్ లాంచింగ్ తర్వాత ప్రభాస్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఓం నువ్వు నా రూమ్ కి వస్తున్నావు కదా, రా లోపలికి రా అంటూ సీరియస్ గా పిలుస్తున్నట్లు ఉన్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని ఎన్టీఆర్ హీరోగా నటించిన బృందావనం సినిమాలో ఒక సీన్ తో లింక్ చేస్తూ లోపలికి వెళ్ళిన తర్వాత ఓం రౌత్ కి ఉంది రో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

బృందావనం సినిమాలో బ్రహ్మానందం క్యారెక్టర్ ను తన తండ్రి పాత్రధారిగా పరిచయం చేస్తాడు ఎన్టీఆర్. అయితే బ్రహ్మానందం కాస్త ఎక్కువ చేయడంతో ఎన్టీఆర్ ఆయనని గదిలోకి తీసుకువెళ్ళు సముదాయిస్తున్నట్లుగా కలరింగ్ ఇచ్చి కోటింగ్ ఇస్తాడు. ఇప్పుడు అదే సీన్లు మళ్ళీ రిక్రియేట్ చేసి ప్రభాస్ ఓమ్ రౌత్ కి కోటింగ్ ఇచ్చాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇందులో నిజం ఎంత ఉంది ఎంత లేదు అనే విషయం పక్కన పెడితే అభిమానులు మాత్రం  ఓం రౌత్ విషయంలో చాలా నిరాశ చెందారు అనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. గతంలో రాధాకృష్ణ కుమార్ రాధేశ్యామ్ సినిమాలో ప్రభాస్ ను ఇబ్బందికరంగా చూపించిన సమయంలో కూడా ప్రభాస్ అభిమానులు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పుడు కూడా దాదాపుగా  ఓం రౌత్ విషయంలో కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుంది. అయితే మరో వాదన ఏమిటంటే ఈ సినిమా కేవలం నార్త్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని చేసింది అని, సినిమా గ్రాఫిక్స్ ఎలా ఉన్నా నార్త్ ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా జైశ్రీరామ్ నినాదం ఉంటే దాన్ని ఆదరిస్తారనే వాదన కూడా ఊపందుకుంది. అయితే ఎంత జైశ్రీరామ్ నినాదం ఉన్నా చీప్ గ్రాఫిక్స్ తో ప్రభాస్ ను ప్రజెంట్ చేయడం అనేది ఏ మాత్రం కరెక్ట్ కాదని పలువురు సినీ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి ఫైనల్ గా ఏం జరగబోతోంది అనేది.

Also Read: Pawan Kalyan in God Father: గాడ్ ఫాదర్ సినిమాలో పవన్ కళ్యాణ్.. కన్వీనియంట్ గా దాచేసిన యూనిట్?

Also Read: NY VFXWala on Adipurush: ఆ గ్రాఫిక్స్ మా పనికాదు.. మాకేం సంబంధం లేదంటూ బాలీవుడ్ హీరో సొంత సంస్థ క్లారిటీ..ఎవరు అబద్దం చెబుతున్నారు?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x