Nagarjuna Dupe: అక్కినేని నాగార్జున.. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా అడుగుపెట్టి తన కంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్నారు. కేవలం తండ్రిలా క్లాస్ హీరోగా మెప్పిస్తూనే.. మాస్ హీరోగా వెండితెరపై శివ తాండవం చేసారు. ఈయన కెరీర్‌లో ఎన్నో డిఫరెంట్ చిత్రాలున్నాయి. అందులో మజ్ను, గీతాంజలి, శివ, అన్నమయ్య, హలో బ్రదర్ వంటి చిత్రాలున్నాయి. ఇందులో నాగార్జున హీరోగా నటించిన 'హలో బ్రదర్' చిత్రంలో పూర్తి స్థాయిలో ద్విపాత్రాభినయం చేసారు. ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డాక్టర్ కె.ఎల్.నారాయణ నిర్మించారు. ఈ సినిమాకు కోటీ అందించిన సంగీతం పెద్ద ఎస్సెట్‌గా నిలిచింది. 'హలో బ్రదర్' మూవీని ఎన్టీఆర్ 'రాముడు భీముడు' తరహాలో ఒక క్యారెక్టర్ అమాయకుడు అయితే.. మరో పాత్ర గడుసుతనం నిండిన క్యారెక్టర్.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'హలో బ్రదర్' మూవీలో నాగార్జున రెండు డిఫరెంట్ పాత్రల్లో మెప్పించాడు. ఈ సినిమాల నాగార్జున సరసన రమ్యకృష్ణ, సౌందర్య హీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాలో నాగార్జున డూప్‌గా హీరో శ్రీకాంత్ నటించినట్టు అప్పట్లో బిగ్‌బాస్ షోలో వెల్లడించారు. ఇక హీరో శ్రీకాంత్‌కు ఇవివితో మంచి అనుబంధమే ఉంది. అంతకు ముందు శ్రీకాంత్.. నాగ్‌ హీరోగా నటించిన 'వారసుడు'లో విలన్‌గా నటించాడు. ఆ తర్వాత 'ప్రెసిడెంట్ గారి పెళ్లాం', 'నిన్నే ప్రేమిస్తా' సినిమాల్లో నటించారు.


ఇంకోవైపు శ్రీకాంత్, నాగార్జున దాదాపు ఒకే హైట్, పర్సనాలిటీ ఉండటంతో ఇద్దరు నాగార్జునలు కనిపించే సన్నివేశాల్లో శ్రీకాంత్ డూప్‌గా నటించారు. ఇక నాగార్జున.. హలో బ్రదర్ మూవీ తర్వాత 'ఎదురులేని మనిషి', సోగ్గాడే చిన్నినాయనా, బంగార్రాజు  చిత్రాల్లో డ్యూయల్ రోల్లో నటిచారు. హలో బ్రదర్‌లో కవల సోదురులుగా నటించిన నాగార్జున.. ఎదురులేని మనిషి.. ఏజ్ గ్యాప్ ఉన్న అన్నదమ్ముల పాత్రలో నటించారు.


ఇక 'సోగ్గాడే చిన్నినాయనా', 'బంగార్రాజు' సినిమాల్లో తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేసారు. నాగార్జున.. రీసెంట్‌గా 'నా సామి రంగ' సినిమాతో పలకరించారు. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది.
Read More: Insulin: ఇన్సులిన్ ఉత్పత్తి తక్కువగా ఉందా? ఈ 3 ఆకులను నమిలండి చాలు.. షుగర్ కంట్రోల్ అవుతుంది..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.