Bangarraju Movie Review: టాలీవుడ్ 'కింగ్' అక్కినేని నాగార్జున (Nagarjuna)కు ఇటీవల ఒక్క సరైన హిట్ పడడం లేదు. 'సోగ్గాడే చిన్ని నాయన' తర్వాత ఆ స్థాయిలో మరో విజయం ఆయన ఖాతాలో పడలేదు. ఇటీవల వరుస పరాజయాలు పలుకరించినా.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఎలాగైనా హిట్ కొట్టాలని భావించిన కింగ్.. తనయుడు, 'యువ సామ్రాట్' అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya)తో కలిసి 'బంగార్రాజు'లో నటించారు. సోగ్గాడే చిన్నినాయ‌నా సినిమాకి బంగార్రాజు సీక్వెల్. సంక్రాంతికి వచ్చిన సోగ్గాడే చిన్నినాయ‌నా భారీ సక్సెస్ అవ్వడంతో బంగార్రాజును కూడా మళ్లీ సంక్రాంతి (Samkranthi)కే తీసుకొచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేసి విజయవంతం అయ్యాడు. ఈ రోజు బంగార్రాజు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నటీనటులు:
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రమే 'బంగార్రాజు'. కల్యాణ్ కృష్ణ (Kalyan Krishna) రూపొందించిన ఈ సినిమా.. 'సోగ్గాడే చిన్ని నాయన'కు సీక్వెల్‌గా తెరకెక్కింది. ఈ సినిమాలో సీనియర్ నటి రమ్యకృష్ణ (Ramya Krishna), యువ హీరోయిన్ కృతి శెట్టి (Krithi Shetty)హీరోయిన్లుగా చేశారు. బంగార్రాజు చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లపై నాగార్జున స్వయంగా నిర్మించారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు, టీసర్, ప్రోమోస్, ట్రైలర్ బంగార్రాజు సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా థియటర్లోకి వచ్చిన బంగార్రాజు సినిమా రివ్యూ (Bangarraju Review)పై ఓ లుక్కేద్దాం. 


కథ:
కథ ఏంటంటే.. సోగ్గాడే చిన్ని నాయన కథ ముగిసిన చోటు నుంచే బంగార్రాజు కథ మొదలవుతుంది. భార్య సత్యభామ (రమ్యకృష్ణ) కోరిక మేరకు కొడుకు రాము (నాగార్జున), కోడలు సీత (లావణ్య త్రిపాఠి)ని ఒక్కటి చేసి పైకి వెళ్లిన బంగార్రాజు (నాగార్జున).. ఈసారి మనవడు చిన బంగార్రాజు (నాగ చైతన్య) కోసం మళ్లీ భూలోకానికి వస్తాడు. చిన బంగార్రాజు పెళ్లితో పాటు లోక కళ్యాణం కోసం యమ ధర్మరాజు బంగార్రాజును కిందికి పంపిస్తాడు. ఊరి స‌ర్పంచ్ కూతురు నాగ‌ ల‌క్ష్మి (కృతి శెట్టి)కి, చిన బంగార్రాజు మ‌ధ్య ప‌చ్చ గ‌డ్డి వేస్తే భ‌గ్గు మంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చిన బంగార్రాజు ఆత్మలోకి ప్రవేశించిన బంగార్రాజు.. చేసిన మాయలు ఏంటి?, వారిని ఎలా కలిపాడు?, గుడి నిధులను ఎలా కాపాడన్నదే మిగతా కథ. 


Also Read: Afghan Crisis: ఆఫ్గన్‌లో అత్యంత దయనీయ పరిస్థితులు.. కిడ్నీలు అమ్ముకుంటున్న పేదలు


ఎలా ఉందంటే:
సోగ్గాడే చిన్ని నాయనా కథకి కొనసాగింపుగా వచ్చిన సినిమా కాబట్టి..  మొదటి భాగం తరహాలోనే గుడికీ, బంగార్రాజు కుటుంబానికీ ముడిపెట్టి కథని అల్లారు దర్శకుడు. తొలి సినిమాలో తనయుడి జీవితాన్ని చక్కదిద్దితే.. ఇందులో మనవడి జీవితాన్ని చక్కబెడతారు.  సోగ్గాడే చిన్ని నాయనాలో బంగార్రాజు మాత్రమే ఆత్మ అయితే బంగార్రాజులో సత్యభామ కూడా ఆత్మే. బంగార్రాజు ప్రథమార్థం అంతా చిన బంగార్రాజు, నాగలక్ష్మి హంగామాతోనే సాగుతుంది. ఒకరంటే ఒకరికి పడని ఆ ఇద్దరూ కలిసే వైనం, పెద్ద బంగార్రాజు చేసే మేజిక్‌తో సినిమా దూసుకెళ్లింది. ఇక ద్వితీయార్థంలో సినిమాపై ప్రేక్షకుడికి ఆసక్తి పెరుగుతుంది. చాలా సన్నివేశాలు బాగుంటాయి. ముఖ్యంగా మాస్ ప్రేక్షకుల్ని మెప్పించే అంశాల్ని పుష్కలంగా ఉన్నాయి.


ఎవరెలా చేశారంటే:
నాగార్జున, నాగ చైతన్యలు సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆత్మగా దూరితే తప్ప సందడి చేయలేని విధంగా చై పాత్రని తీర్చిదిద్దడంతో చాలా చోట్ల నాగార్జునే హైలెట్ అయ్యారు. అయితే ఇద్దరి మధ్య సన్నివేశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. రమ్యకృష్ణ, కృతి శెట్టి పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి. నాగ లక్ష్మి పాత్రపై కృతి తనదైన ముద్ర వేసింది. బేబమ్మ తన అందంతో ఆకట్టుకుంది. సంపత్ రాజ్‌, రావు రమేష్, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, ఝాన్సీ, నాగబాబు తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. సరిగ్గా పండగ సమయంలోనే విడుదలైంది కాబట్టి సినిమాకి ఢోకా ఉండదు. సినిమాకి 2.75/5 రేటింగ్ ఇవ్వొచ్చు. 


ప్లస్ పాయింట్స్:
#నాగార్జున
# పాటలు
# డైలాగ్స్ 


మైనస్ పాయింట్స్:
# ఊహించే కథ
# హాస్యం పండకపోవడం



Also Read: Lockdown in Telangana: తెలంగాణలో లాక్‌డౌన్‌ ఉంటుందా?.. కేటీఆర్ ఏమన్నారంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి