Thalaivar 171: రజినీకాంత్ సినిమాలో తెలుగు స్టార్ హీరో క్యామియో.. పెరిగిపోతున్న అంచనాలు!
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో అతి త్వరలో ఒకే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తన సమాచారం ప్రకారం ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలక పాత్రలో కనిపించబోతున్నారట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Nagarjuna in Thalaivar171: సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ మధ్యనే జైలర్ సినిమా తో మరొక బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నారు. తాజాగా ఇప్పుడు స్టార్ టాలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమాకి సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. లోకేష్ కనగరాజ్ వంటి క్రియేటివ్ డైరెక్టర్ దర్శకత్వంలో రజనీకాంత్ పాత్ర ఎలా ఉండబోతోంది అనే విషయంపై ఇప్పటికే ఎన్నో చర్చలు మొదలయ్యాయి. లోకేష్ రజనీకాంత్ ని నెక్స్ట్ లెవెల్ లో చూపించబోతున్నారు అని అభిమానులు విశ్వసిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ను చిత్ర బృందం త్వరలో విడుదల చేయబోతోంది. 1980లో భారతదేశాన్ని ఊపేసిన బంగారం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా కథ నడవబోతుందట. ఈ సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్జేషన్ కూడా ఇంతకుముందు ఎప్పుడూ చూడనటు విధంగా ఉంటుందని తెలుస్తోంది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక టాలీవుడ్ సీనియర్ హీరో కూడా కీలక పాత్ర పోషించపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ కింగ్ నాగార్జున అని సమాచారం. మల్టీ స్టారర్ సినిమాలు చేయడంలో నాగార్జున కూడా ఈ మధ్య బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. తమిళ్ హీరో ధనుష్ తో కూడా కుబేర సినిమాలో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు.
కాబట్టి అల్లుడి తర్వాత ఇప్పుడు నాగార్జున మామ రజనీకాంత్ తో కూడా నటించడానికి రెడీ అవుతారు అని చెప్పవచ్చు. ఏదేమైనా రజనీ, నాగార్జున కాంబినేషన్ లో సినిమా అంటే కచ్చితంగా అంచనాలు రెట్టింపు అవుతాయి. ప్రస్తుతం రజనీకాంత్ వెట్టయాన్ అనే సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అక్టోబర్ లో విడుదల కాబోతోంది.
వేసవి తర్వాత లోకేష్ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. 1991లో శాంతి క్రాంతి అనే సినిమాలో రజనీకాంత్ తమిళ్లో నటించగా తెలుగులో నాగార్జున నటించారు. కానీ ఇద్దరూ కలిసి ఒకేసారి వెండి తెరపై కనిపించింది లేదు. అందుకే ఈ సినిమాలో వీళ్ళిద్దరి కాంబో అభిమానులకి పండగే అని చెప్పుకోవచ్చు.
Also Read: KCR Sensation: కాంగ్రెస్‌కు భారీ షాక్.. 20 మంది 'హస్తం ఎమ్మెల్యేలు' కేసీఆర్‌తో టచ్‌లోకి
Also Read: Cash For Vote: రేవంత్ రెడ్డిపై ఏపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. చంద్రబాబుతో కుమ్మక్కు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter