The Ghost OTT : ఓటీటీలో టాప్ ప్లేస్‌లో The Ghost.. నాగార్జున ట్వీట్‌పై నెటిజన్ల రియాక్షన్
The Ghost Trends At OTT ది ఘోస్ట్ ఓటీటీలో ప్రస్తుతం ట్రెండ్ అవుతోందట. ఈ మేరకు నాగార్జున వేసిన ట్వీట్ మీద నెటిజన్లు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు.
Nagarjuna The Ghost OTT : నాగార్జున నటించిన చిత్రాలు ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోవడం లేదు. కొత్తగా ట్రై చేస్తోన్న ప్రతీ సినిమా బెడిసి కొడుతోంది. ఆఫీసర్, వైల్డ్ డాగ్, ది ఘోస్ట్ ఈ చిత్రాలన్నీ కూడా కొత్త జానర్లే. ప్రయోగాలే. కానీ ఏ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించలేకపోయాయి. అయితే ఇప్పుడు మాత్రం నాగార్జున ది ఘోస్ట్ సినిమా నెట్ ఫ్లిక్స్‌లో టాప్ ప్లేసులో ట్రెండ్ అవుతోందని తెలుస్తోంది. ఈ మేరకు నాగార్జున ట్వీట్ వేశాడు.
నాగార్జున ప్రవీణ్ సత్తారు కాంబోలో వచ్చిన ది ఘోస్ట్ సినిమా మీద మంచి అంచనాలే ఏర్పడ్డాయి. స్టైలీష్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఈ చిత్రాన్ని ప్రవీణ్ సత్తారు తన స్టైల్లో తెరకెక్కించాడు. కానీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది.ఈ క్రమంలో ఘోస్ట్ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసింది. ఈ చిత్రం అక్టోబర్ 5న గాడ్ ఫాదర్ సినిమాకు పోటీగా వచ్చింది. గాడ్ ఫాదర్‌కు అంతో ఇంతో పాజిటివ్ టాక్ రావడంతో మొదటి వారంలో ఘోస్ట్ ఊసే లేకుండాపోయింది.
ఇప్పుడు ఘోస్ట్ సినిమాకు మాత్రం ఓటీటీలో మంచి ఆదరణ లభించినట్టు తెలుస్తోంది. టాప్ ప్లేసులో ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్‌లో ట్రెండ్ అవుతోందంటూ నాగార్జున ట్వీట్ వేశాడు. ఈ రోజు ఇండియాలో ట్రెండ్ అవుతోన్న మొదటి చిత్రాల్లో ది ఘోస్ట్ టాప్ ప్లేస్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఓటీటీ ప్రేక్షకులను మాత్రం ది ఘోస్ట్ బాగానే ఆకట్టుకుంటున్నట్టు కనిపిస్తోంది.
ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌కు బదులు సోనాల్ చౌహాన్ నటించిన సంగతి తెలిసిందే. కాజల్ తన ప్రెగ్నెన్సీ మూలనా.. ది ఘోస్ట్ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ది ఘోస్ట్ సినిమాలో సోనాల్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రవీణ్ సత్తారు మేకింగ్, టేకింగ్‌కు మంచి పేరు వచ్చినా.. ది ఘోస్ట్ మాత్రం వసూళ్లను రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఇలా నెంబర్ వన్ స్థానంలో ట్రెండ్ అవుతుండటంతో నెటిజన్లు షాక్ అవుతున్నారు. థియేటర్లో బాగా లేదని అన్నారే.. ఇప్పుడు ఇలా అంటున్నారేంటి? అని నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Also Read : Urvasivo Rakshasivo Review: అల్లు శిరీష్ ఊర్వశివో రాక్షసివో సినిమా ఎలా ఉందంటే?
Also Read : సంతోష్ శోభన్ హీరోగా నటించిన లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ మూవీ రివ్యూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook