Nagarjuna: నాగార్జున అక్కినేని తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తనదైన శైలిలో తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా అల్లరి నరేష్ తో కలిసి ‘నా సామిరంగ’ సినిమాతో పలకరించారు. ఈ సినిమా సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర హిట్ గా నిలిచింది. ఈ సినిమా తర్వాత త్వరలో ‘కుబేర’ సినిమాలో ఇంసార్టెంట్ రోల్ చేస్తున్నారు. ధనుశ్, రష్మిక హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక నాగ్ పూర్తి స్థాయిలో   హీరోగా త్వరలో ప్రకటించనున్నారు. తాజాగా నాగార్జున .. ఎయిర్ పోర్ట్ వెళుతుండగా..  ఓ పెద్దాయన .. నాగ్ కలిసేందకు ప్రయత్నించగా.. ఆయన సెక్యురిటీ గార్డ్.. నిర్దాక్షిణ్యంగా పక్కకు తోసేసాడు. దానికి సంబంధించిన విజువల్స్... సోషల్ మీడియాలో వైరల్ అయింది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఎంత హీరో అయినంత మాత్రానా.. ఇలా ఓ అభిమాని దగ్గరకు వస్తే ఇలా చేస్తారా అని నాగార్జునను సోషల్ మీడియా వేదికగా ఏకి పారేస్తున్నారు. ఈ విషయం నాగార్జన దృష్టికి రాగా.. ఇలా జరగకూడదు. ఇకపై ఇలాంటి తప్పులు జరగ్గకుండా జాగ్రత్త పడతాను. నా సెక్యురిటీ గార్డ్ మూలంగా బాధ పడ్డ పెద్ద మనిషికి క్షమాపణలు చెబుతున్నాను. ఇక ముందు ఇలాంటివి పునరావృతం కాకుండా  జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పుకొచ్చారు.  


 


 చేసిన తప్పుకు నాగార్జున క్షమాపణలు చెప్పడంతో మిగతా అభిమానులు శాంతించారు. నాగార్జున ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. త్వరలో తన కుమారుడు అఖిల్ తో కలిసి ఓ సినిమాలో  యాక్ట్ చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.


Also read: IRCTC Alert: ఫ్రెండ్స్ కోసం రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారా, మూడేళ్లు జైలు శిక్ష తప్పదు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook