Nailu Nadi Lyrical Song WWW Telugu Movie | టాలీవుడ్ హీరో రాజశేఖర్ కుమార్తె శివానీ రాజశేఖర్, ఆదిల్ అరుణ్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ (WWW Movie). సినిమాటోగ్రాఫర్‌గా సేవలు అందించిన కేవి గుహన్ ఈ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. స్టోరీ, స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ బాధ్యతలు సైతం తానే స్వీకరించాడు. విడుదలకు ముందే ఈ సినిమా ఆడియో సక్సెస్ అందుకుంటోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవల డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ మూవీ నుంచి ‘కన్నులు చెదిరే అందాన్నే’ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్ అయింది. అనంత శ్రీరామ్ సాహిత్యం అందించిన ఈ పాట తరువాత మరోసాంగ్ యువతను ఆకట్టుకుంటోంది. రామజోగయ్య శాస్త్రి, మధన్ కార్కి సాహిత్యం అందించిన ‘నైలునది దారలాగ ప్రవహించే నేడు తొలి ప్రేమ స్వరం’ టాలీవుడ్ ప్రేక్షకులు లాక్‌డౌన్ సమయంలో ఈ వీడియో సాంగ్‌కు కనెక్ట్ అయ్యారు. సిధ్ శ్రీరామ్, కళ్యాణి నాయర్ అద్బుతంగా ఆలపించిన WWW Telugu Movie సాంగ్ వీక్షించండి.


Also Read: Shivani Rajashekar: కన్నులు చెదిరే అందాన్నే లిరికల్ సాంగ్ Youtubeలో ట్రెండింగ్



ఆదిల్ అరుణ్, శివానీ రాజశేఖర్‌ (Shivani Rajashekar) జంటగా నటించిన డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ సినిమాకు సిమోన్ కే కింగ్ స్వరాలు సమకూర్చారు. ఈ పాటకు గిటార్ కీత్ పీటర్స్, ఎలక్ట్రిక్ గిటార్ గాడ్‌ఫ్రే ఇమ్మాన్యుయేల్, డ్రమ్స్ వసంత్ డేవిడ్, హరిత వీణను ప్లే చేశారు. మా రామంత్ర క్రియేషన్స్ బ్యానర్‌లో డాక్టర్ రవి ప్రసాద్ రాజు దాట్ల ఈ WWW Movieని నిర్మించారు. ఆదిత్య మ్యూజిక్ ఈ బ్యూటిఫుల్ సాంగ్స్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆడియో హిట్ కావడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి.


Also Read: Rakul Preet Singh New Dish: రకుల్ ప్రీత్ కొత్త వంటకం, తప్పించుకున్న నటి సోదరుడు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook