Pallavi Prashanth Bail: పల్లవి ప్రశాంత్‌కు ఊరట.. బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు..
Pallavi Prashanth: బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు ఊరట లభించింది. అతడికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన దాడి ఘటనలో ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
Pallavi Prashanth Bail: బిగ్‌బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ధ్వంసం, దాడి కేసులో అతడికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆదివారం పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. 15 వేల పూచీకత్తు చెల్లించాలని సూచించింది. ప్రశాంత్ శుక్రవారం లేదా సోమవారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
బిగ్‌బాస్ ఫైనల్ ముగిశాక హైదరాబాద్‍లోని అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నర్ అమర్ దీప్ అభిమానుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కొందరు.. కంటెస్టెంట్ల వాహనాలు, పోలీస్ వెహికల్స్, ఆర్టీసీ బస్సుల అద్దాలను దాడికి తెగబడి ధ్వంసం చేశారు. ఇది చేసింది పల్లవి ప్రశాంత్ మద్దతుదారులనే పోలీసులు సుమోటోగా కేసు నమోదుచేశారు.
ఈ కేసులో ఎ-1గా పల్లవి ప్రశాంత్‌ను చేర్చగా, ఎ-2గా అతడి సోదరుడు మనోహర్, ఎ-3గా అతడి ప్రెండ్ వినయ్‌ను చేర్చారు. పల్లవి ప్రశాంత్, మనోహర్‌ను పోలీసులు కోర్టులో హాజరుపర్చగా.. వారికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. అదే సమయంలో ప్రశాంత్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నేడు(డిసెంబరు 22, శుక్రవారం) విచారణ జరిపిన న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది.
ప్రశాంత్ జైలు నుంచి విడుదలవ్వడంలో సింగర్ భోలే కీలకపాత్ర పోషించాడు. అతడిని బయటకు తీసుకొచ్చే వరకు నిద్రపోలేదు భోలే. ఎలాగైనా రైతుబిడ్డను బయటకు తీసుకురావాలని పాటబిడ్డ భోలే నడుంబిగించాడు. లాయర్లతో మాట్లాడి అతడికి 48 గంటల్లోనే బెయిల్ వచ్చేలా చేశాడు. ఈ సందర్భంగా అతడు లాయర్లకు కృతజ్ఞతలు తెలిపాడు.
Also Read: Jr NTR: జూ. ఎన్టీఆర్ మరో ఘనత.. టాప్-50 ఆసియా నటుల జాబితాలో తారక్ కు చోటు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook